నెల్లూరు జిల్లాలో స్కూల్ బ‌స్సుకు ప్ర‌మాదం

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ప్రైవేట్ స్కూల్ బ‌స్సుకు ప్ర‌మాదం జ‌రిగింది.అతివేగంతో ఎదురుగా వ‌స్తున్న ట్రాక్ట‌ర్ ను త‌ప్పించ‌బోయి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా ప‌డింది.

ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు విద్యార్థుల‌కు తీవ్ర గాయాలు కాగా, మిగ‌తా విద్యార్థులు స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు.

గ‌మ‌నించిన స్థానికులు క్ష‌త‌గాత్రుల‌ను ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 15 మంది విద్యార్థులు ఉన్న‌ట్లు స‌మాచారం.

మిన‌గ‌ల్లు నుండి బుచ్చికి వ‌స్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింద‌ని స్థానికులు చెబుతున్నారు.