ఏలూరు జిల్లాలో స్కూల్ బ‌స్సుకు ప్ర‌మాదం

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండ‌లం రౌతుగూడెం వ‌ద్ద ప్ర‌మాదం జ‌రిగింది.ఆగి ఉన్న స్కూల్ బ‌స్సును జంగారెడ్డిగూడెంకు చెందిన మ‌రో స్కూల్ బ‌స్సు ఢీకొట్టింది.

ఈ ప్ర‌మాదంలో ప‌లువురు విద్యార్థుల‌కు స్వ‌ల్ప గాయాలు అయ్యాయి.జంగారెడ్డిగూడెంకు చెందిన వెంక‌టేశ్వ‌ర స్కూల్ బ‌స్ డ్రైవ‌ర్ అతివేగం, నిర్ల‌క్ష్యం వ‌ల‌నే ప్ర‌మాదం జ‌రిగింద‌ని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మ‌రోవైపు ప్రైవేట్ స్కూల్ బ‌స్సుల ఫిట్ నెస్, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా డ్రైవ‌ర్ల నియామ‌కం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.