8 ఏళ్ల వయసులో శవం తో కొన్ని గంటలు బంధింపబడ్డ హీరో ఇతనే..!

దిలీప్ కుమార్.( Dilip Kumar ) ఈ పేరుకు బాలీవుడ్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.

విషాదకరమైన ఎక్స్ప్రెషన్స్ పలకడంలో దిలీప్ కుమార్ చాలా అద్భుతంగా నటిస్తారు అనే పేరు ఉంది.

అందుకే ఆయనను కింగ్ ఆఫ్ ట్రాజెడి( King Of Tragedy ) అని కూడా పిలుస్తారు.

అనేక సినిమాలో ఎన్నో విషాదకరమైన హావభావాలతో పాటు హాస్య భరిత పాత్రలను కూడా పోషించడంలో ఆయనకు ఆయనే సాటి.

అయితే షూటింగ్ సమయంలో ఆయన విచిత్రంగా బిహేవ్ చేస్తుంటారు అని అందరూ అంటారు.

తన సీన్ అయిపోయిన వెంటనే చాలా దూరంగా వెళ్లి ఒంటరిగా ఒక్కడే కూర్చునే వాడట.

అలా దూరంగా ఉండటాన్ని కొంతమంది పొగరు అనుకునేవారు.కానీ అందుకు చాలా పెద్ద కథే ఉంది.

అదేంటో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. """/" / దిలీప్ కుమార్ ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు తన చుట్టాల్లో ఒక వ్యక్తి చనిపోయారట.

అయితే ఆయనను ఒక గదిలో పెట్టి అక్కడికి చిన్న పిల్లలను ఎవ్వరిని వెళ్ళవద్దు అని చెప్పారట.

అలా ఎందుకు వెళ్ళవద్దు అని చెప్పారో ఆ వయసులో దిలీప్ కుమార్ కి అర్థం కాక తన స్నేహితులను అడిగాడట.

వారు కూడా సరైన సమాధానం చెప్పకపోవడంతో తానే ఆ రూమ్ లోకి వెళ్ళాలనే ఉత్సాహంతో ఎవ్వరూ చూడకుండా వెళ్ళాడట.

అయితే అప్పటికే తలుపు తీసి ఉందని ఎవరో వచ్చి బయట నుంచి గడి పెట్టి వెళ్లిపోయారట.

ఎంత అరిచినా కూడా దగ్గరలో ఎవరూ లేకపోవడంతో భయంగా ఒక్కడే శవంతో చాలా గంటల పాటు ఉండాల్సి వచ్చిందట.

అలా తనలో చాలా అతి భయం అనేది పట్టుకుంది. """/" / అందుకే ఆ తర్వాత ఎవరితో కలిసేవాడు కాదు.

ఒంటరిగా ఉండడానికే ఇష్టపడేవాడు.ఎంత ప్రయత్నించిన జనాల్లోకి వెళ్లడానికి అస్సలు ఒప్పుకునేవాడు కాదు.

ఆ తర్వాత కొన్నాళ్ళకి సినిమా ఇండస్ట్రీపై ఉన్న ఇంట్రెస్ట్ తో బాలీవుడ్ లోకి( Bollywood ) ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో అయ్యాడు.

అయినా కూడా ఆయనలోని భయం మాత్రం పోలేదు.ఎప్పుడు ఒక్కడే కూర్చునే వాడు.

ఎంత పెద్ద పార్టీ జరిగిన తనదైన ప్రపంచంలోనే ఉండేవాడు.అలా దిలీప్ కుమార్ తన జీవితాన్ని సినిమాకి అంకితం చేశాడు.

కేవలం హీరోగా మాత్రమే కాదు ప్రొడ్యూసర్ గా కూడా దిలీప్ కుమార్ కొన్ని చిత్రాలను నిర్మించాడు.

మాలాంటి హీరోలకు అలాంటి డైలాగు చెప్పే హక్కు లేదు: దుల్కర్ సల్మాన్