వాటిని చూసి నోట్లను కడిగి ఆరబెడుతున్న జనం, ఎక్కడంటే

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా నోట్ల ద్వారా కూడా సోకుతుంది అంటూ సోషల్ మీడియా లో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

అంతేకాకుండా ఆమధ్య ఒక వీడియో లో ఒకరు రూ.500 నోటుతో ముక్కు తుడుచుకున్న ఘటన కూడా ప్రజల్లో నోట్లు వినియోగించే విషయంలో ఆందోళన వ్యక్తం అవుతుంది.

ఇలాంటి వీడియోలు వైరల్ గా మారడం తో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు హడలెత్తిపోతున్నారు.

అయితే కరెన్సీ నోట్ల ద్వారా తమకు వైరస్ వ్యాప్తి చెందకూడదు అంటూ చైనా లో ఒక మహిళ ఓవెన్ లో పెట్టి బూడిద చేసిన ఘటన గుర్తు ఉండే ఉంటుంది.

అయితే కర్ణాటక మాండ్యా లోని మరనచకనహళ్లి గ్రామస్తులు కొత్తగా నోట్లను నీళ్ళల్లో శుభ్రం చేసుకొని ఆ తరువాత ఎండలో ఆరబెడుతున్నారట.

రూ.2000,రూ.

500,రూ.100 నోట్లను నీళ్లల్లో కడిగి ఆ తరువాత ఆరబెట్టుకొని వాడుకుంటున్నారు.

గ్రామస్తులు తమ పంటలను అమ్మగా వచ్చిన డబ్బులను అలానే వాడకుండా ఇలా వాటిని నీటిలో శుభ్రం చేసుకొని ఆరబెట్టుకొని వాడుకుంటున్నారు.

ఇలా చేయడం వల్ల తమకు కరోనా వైరస్ రాకుండా అడ్డుకోవచ్చు అంటూ వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయాన్ని ఆగ్రామానికి చెందిన కొందరు చెబుతున్నారు.సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియోల నేపథ్యంలో తమ గ్రామస్తులు ఇలా నిర్ణయించుకున్నారని, అందుకే ఇలా నీళ్ల తో ఆ నోట్లను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని వాడుకుంటున్నారట.

అయితే అధికారులు దీనిపై స్పందిస్తూ గ్రామస్తులు ఆందోళన చెందడం వల్ల చేస్తున్న పనే కానీ,ఇది ఏమాత్రం ఆహ్వానించదగినది కాదని అంటున్నారు.

"""/"/ కానీ గ్రామస్తులు మాత్రం కరెన్సీ నోట్లను కడగడం ద్వారా ఆ నోట్లపై ఉన్న వైరస్ చచ్చిపోతుంది అంటూ వారు నమ్ముతున్నారు.

వర్షానికి నోట్లు తడిస్తేనే అయ్యయ్యో అని అనుకుంటాం,కానీ ఇప్పుడు ఈ కరోనా వైరస్ మూలంగా జనాలే వాటిని నీళ్లల్లో కడిగి మరి వాడుకుంటున్న పరిస్థితులు ఏర్పడ్డాయి.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు,ఢిల్లీ లలోనే అత్యధికంగా కేసులు నమోదు అవుతుండడం గమనార్హం.

పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరంలో రిలీజ్ చేసే రెండు సినిమాలు ఇవే…