టెక్నాలజీ తో బ్యాంక్ ఏటీఎంలలో రూ.6.96 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు..!

టెక్నాలజీ తో బ్యాంక్ ఏటీఎంలలో రూ.6.96 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు!

ప్రపంచం టెక్నాలజీ( Technology)లో ఎంత అభివృద్ధి చెందిన కూడా దొంగతనాలు చేసేవారు శాస్త్ర సాంకేతికలోని లోపాలను పసిగట్టి సులభంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు.

టెక్నాలజీ తో బ్యాంక్ ఏటీఎంలలో రూ.6.96 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు!

కొందరు యువకులు ఒక ముఠాగా ఏర్పడి డీసీసీబీ బ్యాంకులోని ఏటీఎంలలో ఏకంగా రూ.

టెక్నాలజీ తో బ్యాంక్ ఏటీఎంలలో రూ.6.96 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు!

6.96 లక్షల నగదును చోరీ చేశారు.

ఖమ్మం జిల్లాలోని వైరా, తల్లాడ మండల కేంద్రాల్లో ఉన్న డీసీసీబీ బ్యాంక్ ఏటీఎంలలో( DCCB Bank ATMs ) దొంగల ముఠా చోరీకి పాల్పడ్డారు.

అయితే ఈ దొంగతనం కాస్త ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో.

ఎలా దోపిడీ చేశారో అనే వివరాలు చూద్దాం.జూలై 1వ తేదీన వైరాలోని డీసీసీబీ బ్యాంక్ ఏటీఎంలో 17 ఏటీఎం కార్డులతో రూ.

4.16 లక్షలు, తల్లాడ ఏటీఎంలో 11 ఏటీఎం కార్డులతో రూ.

2.80 లక్షలు చోరీ చేశారు.

దొంగల ముఠా తమ వద్ద ఉన్న ఏటీఎం కార్డును మిషన్ లో పెట్టి, పిన్ నెంబర్ ఎంటర్ చేసి, నగదు ఉపసంహరణ చేసేందుకు బటన్ నొక్కారు.

ఏటీఎం మిషన్ డబ్బులు లెక్కించి, డబ్బు బయటకు వచ్చే సమయంలో ఏటీఎం మిషన్ కు కరెంట్ సప్లై చేసే స్విచ్ ను ఆఫ్ చేశారు.

అప్పుడు నగదు ఏటీఎం నుంచి మధ్యకు వచ్చి ఆగిపోయింది.వెంటనే కరెంట్ సప్లై చేసే స్విచ్ ఆన్ చేశాక నగదు బయటకు వచ్చింది.

కానీ అకౌంట్ లో నగదు కట్ కాలేదు.ఈ హైటెక్ మోసంతో దొంగలు ఏకంగా 17 ఏటీఎం కార్డుల ద్వారా 30 సార్లు నగదును దోచుకున్నారు.

ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటపడిందని ఆ బ్రాంచ్ లకు చెందిన బ్యాంక్ మేనేజర్లు తెలిపారు.

"""/" / ""img / బ్యాంకు సిబ్బంది ఏటీఎంలలో నగదు పెట్టే సమయంలో నగదును లెక్కించగా కౌంటింగ్ లో తేడా రావడంతో అనుమానం వచ్చి వైరా బ్యాంక్ మేనేజర్ సీసీటీవీ ఫుటేజ్ లను తనిఖీ చేశారు.

జులై ఒకటవ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో ఏకధాటిగా ఏటీఎం కార్డుల ద్వారా నగదును డ్రా చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ లలో ఇప్పించింది.

నగదును లెక్కించగా రూ.4.

16 లక్షల నగదు మాయమైంది.అదే సమయంలో తల్లాడ( Thallada) డీసీసీబీ బ్యాంక్ ఏటీఎం లో రూ.

2.80 లక్షల నగదు మాయమైంది.

దీంతో బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు బ్యాంక్ ఎటిఎం మిషన్లను పరిశీలించి సీసీ టీవీ ఫుటేజ్ లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మోక్షజ్ఞ విషయంలోనే ఇలా ఎందుకు అవుతుంది… కారణం ఏంటి..?