సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు మస్కా కొట్టిన కేటుగాళ్లు.. ఖాతాలో రూ.5 లక్షలు ఖాళీ చేసేశారు

రోజురోజుకూ సైబర్ మోసాలు( Cyber ​​fraud ) పెరిగిపోతున్నాయి.ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పటికీ కొత్త కొత్త మార్గాల్లో డబ్బులు కొట్టేస్తున్నారు.

ప్రముఖ సంస్థల నకిలీ వెబ్ సైట్లు సృష్టించి ప్రజలను ఏమార్చుతున్నారు.భారీగా ఆఫర్లు ప్రకటించి, లింక్ క్లిక్ చేయగానే ఖాతాల నుంచి డబ్బులు మాయం చేస్తున్నారు.

ఇదే కాకుండా ప్రముఖ సంస్థల పేరుతో నకిలీ టోల్ ఫ్రీ నంబర్లను వెబ్ సైట్లలో ఉంచుతున్నారు.

వీటికి ఫోన్ చేసిన వారిని బుట్టలో వేసుకుని, క్షణాల్లో వారి ఖాతాల నుంచి డబ్బులు దోచేస్తున్నారు.

తాజాగా ఇదే తరహాలో ఓ మహిళ భారీగా డబ్బులు పోగొట్టుకుంది.లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. """/" / యూపీలోని నోయిడాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా( Software Engineer ) పని చేసే ఓ మహిళ ఇటీవల ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంది.

అయితే ఆమె స్టేషన్‌కు వెళ్లినా ట్రైన్ 4 గంటలు ఆలస్యంగా వచ్చింది.దీంతో ఐఆర్‌సీటీసీ నుంచి రీఫండ్ చేసుకుందామని భావించింది.

దాని కోసం గూగుల్‌లో వెతికి ఓ టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసింది.

అటువైపు ఫోన్ ఎత్తిన వ్యక్తి ఆమె నుంచి వివరాలు పొందాడు.రీఫండ్ వస్తుందని ఆమెను నమ్మించాడు.

మాటల్లో పెట్టిన ఆమె బ్యాంకు వివరాలు, ఫోన్‌కు వచ్చిన ఓటీపీలు తెలివిగా పొందాడు.

తొలుత ఓ లింక్‌ పంపించి దానిపై క్లిక్ చేయమని చెప్పాడు.ఆమె అలాగే చేసింది.

కాసేపటికి ఆమెకు అనుమానం వచ్చి అన్ని అనుమానాస్పద లింక్‌లు, యాప్‌లు డిలీట్ చేసింది.

అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఆ సైబర్ నేరగాడు ఆమె నెట్‌బ్యాంకింగ్ ఖాతాకు లాగిన్( Netbanking Account ) అయ్యాడు.

ఆమె ఖాతా నుంచి రూ.3 లక్షల వ్యక్తిగత రుణం తీసుకుని తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు.

అంతేకాకుండా ఆమె క్రెడిట్ కార్డును ఉపయోగించి రూ.2 లక్షలు స్వాహా చేశాడు.

దీనిపై ఆమె ఐఆర్‌సీటీసీకి ఫిర్యాదు చేసింది.దీంతో ఐఆర్‌సీటీసీ స్పందించింది.

తాము ఇలా ఎప్పుడూ ఓటీపీలు అడగమని, లింకులు పంపించి క్లిక్ చేయాలని కోరబోమని చెప్పింది.

ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

లడ్డు వివాదం : నేడు తిరుపతికి సిట్ బృందం