ఖాతాదారులను అలర్ట్‌ చేసిన ఎస్‌బీఐ!

ఖాతాదారులను అలర్ట్‌ చేసిన ఎస్‌బీఐ!

కొవిడ్‌ వల్ల అందరూ ఆన్‌లైన్‌ బాట పట్టారు.అన్ని చెల్లింపులు ఆన్‌లైన్‌ ద్వారానే చేపడుతున్నారు.

ఖాతాదారులను అలర్ట్‌ చేసిన ఎస్‌బీఐ!

ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్‌ మోసాలు కూడా బాగా పెరిగాయి.మొన్న అమెజాన్‌ గిఫ్ట్‌ అని.

ఖాతాదారులను అలర్ట్‌ చేసిన ఎస్‌బీఐ!

ఆ తర్వాత పే టీఎం.ఇలా రకరకాల లింక్‌లు పంపిస్తూ వినియోగదారులను.

అందులోనూ అమాయకపు వ్యక్తులను మోసం చేస్తున్నారు హ్యాకర్స్‌.ఈ లింక్‌లను ఓపెన్‌ చేయగానే సదరు బ్యాంక్‌ ఖాతాదారుల నుంచి డబ్బులు మాయం చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు.

ఈ విధంగా ఆన్‌లైన్‌ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఖాతాదారులను హెచ్చరిస్తూ ఒక ట్వీట్‌ చేసింది దిగ్గజ బ్యాంక్‌ ఎస్‌బీఐ.

తెలియని లింక్‌ల ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని సూచించింది.అపరిచిత యాప్‌ లింక్‌ల ద్వారా డౌన్‌లోడ్‌ చేసిన వెంటనే సదరు ఫోన్‌కు లింక్‌ ఉన్న బ్యాంకు ఇతరాల వాటి ఓటీపీ, మెసేజ్‌లు సైబర్‌ నేరగాళ్లకు వెళ్లిపోతాయి.

పీఓఎస్‌ మెషీన్‌ ఆధారంగా కేవలం డెబిట్‌ కార్డు ద్వారానే చెల్లింపులు చేపట్టాలని ఖాతాదారులకు తెలిపింది.

ఇంకా బ్యాంకుకు సంబంధించిన వివరాల కోసం తెలియని యాప్లు లేదా సైట్‌లలో వెతకవద్దని సూచించింది.

ఇంకా టోల్‌ ఫ్రీ నంబర్‌ల ద్వారా ఫోన్‌ చేయాలనుకుంటే, బ్యాంకులకు సంబంధించిన యాప్‌లలోనే సదరు నంబర్‌ అందుబాటులో ఉంటుందని సూచించింది.

ఒకవేళ కాల్‌ సెంటర్‌ ఎగ్జిక్యూటీవ్‌తో మాట్లాడాలనుకుంటే ఛాట్‌ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

వినియోగదారులు జాగ్రత్తగా ఉండకపోతే వారి డబ్బును కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.కరోనా నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయి, జీతాలు లేక చాలా మంది కొట్టుమిట్టాడుతున్నారు.

"""/" / ఈ తరుణంలో ఆదమరిస్తే.ఇంకేం లేదు ఉన్న డబ్బంతా పోగొట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.

ఏటీఎం వద్ద డబ్బులు డ్రా చేయడానికి వెళ్లినా.తెలియని వారికి పిన్‌ నంబర్‌ షేర్‌ చేయకూడదు.

చూడనివ్వకుండా కూడా జాగ్రత్త పడాలి.అనుమానం వస్తే పిన్‌ నంబర్‌ కూడా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది.

గిఫ్ట్‌లు మీ సొంతం అంటూ లేదా స్క్రాచ్‌ కార్డుల ద్వారా కూడా సైబర్‌ నేరగాళ్లు గాలం వేస్తున్నారు.

ఓ లింక్‌ పంపించి దానికి సమాధానం చెప్పమని, మళ్లీ దాన్ని ఐదు వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేయమని లేదా 20 మంది స్నేహితులకు పంపమని వస్తుంది.

అప్పడు మీతో పాటు ఆ లింక్‌ ఓపెన్‌ చేసిన ప్రతి ఒక్కరూ బాధితులవుతారు .

అందుకే తస్మాత్‌ జాగ్రత్త!.

ఫ్రిజ్‌ వాట‌ర్ తాగ‌డం వ‌ల్ల లాభమా? న‌ష్టమా?

ఫ్రిజ్‌ వాట‌ర్ తాగ‌డం వ‌ల్ల లాభమా? న‌ష్టమా?