రూ.2 వేల నోట్ల మార్పిడిపై ఎస్బీఐ స్పష్టత

రూ.2 వేల నోట్ల మార్పిడిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టత ఇచ్చింది.

రూ.2 వేల నోట్ల మార్పిడికి ఎలాంటి పత్రం నింపాల్సిన అవసరం లేదని తెలిపింది.

రూ.20 వేల వరకు బ్యాంకులో నేరుగా మార్చుకోవచ్చని ఎస్బీఐ వెల్లడించింది.

కాగా తాజాగా రెండు వేల నోట్లను రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగానే రూ.2 వేల నోట్ల చెలామణిని ఉప సంహరించుకున్నట్లు ప్రకటించింది.

ఈ క్రమంలోనే మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు రూ.2 వేల నోట్ల మార్పిడికి అనుమతిని ఇస్తూ ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

వైరల్ వీడియో: ఆఫ్రికాను తాకిన మంచు తుఫాను.. మంచులో ఎంజాయ్ చేస్తున్న సింహాలు..