ఎస్.బి. ఐ.టి.కళాశాల లో కొత్త కోర్సులకు ప్రభుత్వ అనుమతి
TeluguStop.com
ఇంజనీరింగ్ కళాశాల లో బిటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కు అనుబందమైన బిటెక్.
సిఎస్ఈ (ఎ ఎల్ అండ్ ఎంఎల్) ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ,బిటెక్ (డేటా సైన్స్) అనే కొత్త కోర్సులకు తెలంగాణా ప్రభుత్వం అనుమతి నిస్తు జీఓ విడుదల చేసిందని కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21వ శతాబ్దం లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ , డేటా సైన్స్ రంగాలకు భవిష్యత్ లో ఉండే డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త కోర్సులను ప్రవేశ పెట్టడం జరిగిందని ఆయన వివరించారు.
విద్యార్థులందరూ ఈనెల 28 నుండి జరగబోయే ఎంసెట్_2022రెండవ ఫేస్ ఆన్లైన్ కౌన్సిలింగ్ నందు ఆప్షన్స్ ఇచ్చి ఈ కొత్త కోర్సులలో చేరే అవకాశాన్ని వినియోగించు కోవాలని ఆయన సూచించారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం.. అతిథులు ఎవరంటే?