ఈ మెంతుల మాస్క్ తో పల్చటి కురులకు చెప్పండి గుడ్ బై!
TeluguStop.com
మనలో చాలా మంది పల్చటి జుట్టును( Thin Hair ) కలిగి ఉంటారు.
ఇటువంటివారు కురుల విషయంలో ఎంతో అసహనానికి గురవుతుంటారు.ఎటువంటి హెయిర్ స్టైల్స్ సెట్ అవ్వక మదన పడుతూ ఉంటారు.
జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు ఎన్నెన్నో హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు.రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.
అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే మెంతుల మాస్క్( Fenugreek Hair Mask ) ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
వారానికి ఒక్కసారి ఈ మాస్క్ ను కనుక వేసుకుంటే పల్చటి కురులకు గుడ్ బై చెప్పవచ్చు.
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసి ఒక కప్పు ఫ్రెష్ కొబ్బరి పాలు( Coconut Milk ) పోసి మిక్స్ చేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న మెంతులను వేసుకుని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మెంతుల మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloevera Gel ) వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె వేసి కలుపుకోవాలి.
"""/" /
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
ఈ మెంతుల మాస్క్ జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది.మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
కొన్ని నెలల్లోనే ఒత్తైన కేశాలను మీ సొంతం చేస్తుంది. """/" /
అలాగే ఈ మాస్క్ జుట్టులో తేమను నిలిపి, మృదువుగా మరియు షైనీ గా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.
ఈ మెంతుల మాస్క్ లో విటమిన్ బి ఉంటుంది.ఇది శిరోజాలకు పోషణనిస్తుంది మరియు సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది.
అంతేకాకుండా ఈ మెంతుల మాస్క్ జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికడుతుంది.ఆరోగ్యమైన కురులకు మద్దతు ఇస్తుంది.
కాబట్టి, థిక్ అండ్ హెల్తీ హెయిర్ ను కోరుకునేవారు తప్పకుండా ఆ మాస్క్ ను ట్రై చేయండి.
మీ పిల్లల్లో బలహీనత పోవాలంటే వారి బ్రేక్ ఫాస్ట్ లో ఇది ఉండాల్సిందే!