ఒక చిన్న బంగాళదుంపలో ఇలా చేశారంటే హెయిర్ ఫాల్ కు బై బై చెప్పవచ్చు..!
TeluguStop.com
బంగాళదుంప( Potato ).చాలా మందికి ఫేవరెట్ వెజిటేబుల్స్ లో ఒకటి.
పిల్లల నుంచి పెద్దల వరకు బంగాళదుంపను ఇష్టంగా తింటుంటారు.పైగా బంగాళదుంపతో ఏ రెసిపీ చేసిన కూడా టేస్ట్ అదిరిపోతుంది.
అయితే రుచి గురించి పక్కన పెడితే బంగాళదుంపలో ఎన్నో బ్యూటీ సీక్రెట్స్ దాగి ఉన్నాయి.
ముఖ్యంగా జుట్టు సంరక్షణకు బంగాళదుంప గ్రేట్ గా సహాయపడుతుంది.ఒక చిన్న బంగాళదుంపను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే హెయిర్ ఫాల్ సమస్యకు సులభంగా బై బై చెప్పవచ్చు.
అందుకోసం ముందుగా ఒక చిన్న బంగాళదుంప తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే ఒక ఉల్లిపాయను( Onion ) కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ఉల్లిపాయ ముక్కలతో పాటు రెండు లేదా మూడు లెమన్ స్లైసెస్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
"""/" /
ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Castor Oil ), వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive Oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
40 నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ విధంగా కనుక చేస్తే బంగాళదుంప ఉల్లిపాయ లో ఉండే పలు సమ్మేళనాలు జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తాయి.
జుట్టు రాలడాన్ని అరికడతాయి. """/" /
అలాగే ఆముదం, ఆలివ్ ఆయిల్ కూడా హెయిర్ ఫాల్ ను నివారించడానికి తోడ్పడతాయి.
జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.ఇక నిమ్మరసం చుండ్రు సమస్యను దూరం చేసి స్కాల్ప్ ను హెల్తీ గా మారుస్తుంది.
కాబట్టి జుట్టు అధికంగా రాలుతుందని బాధపడుతున్న వారు తప్పకుండా బంగాళదుంపతో ఈ సింపుల్ రెమెడీని ట్రై చేయండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.
ఆ స్టార్ డైరెక్టర్ డైలాగ్స్ అంటే ప్రభాస్ కు చాలా ఇష్టమట.. ఫ్లాపులిచ్చినా మారలేదుగా!