చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా ఈ రెమెడీతో శాశ్వతంగా వదిలించుకోండి!
TeluguStop.com
చుండ్రు( Dandruff ).మనలో చాలా మందిని కలవర పెట్టి సమస్యల్లో ఒకటి.
అందులోనూ ప్రస్తుతం చలికాలంలో పొడి చలి వాతావరణం చుండ్రును మరింత తీవ్రతరం చేస్తుంది.
ఈ క్రమంలోనే చుండ్రును వదిలించుకునేందుకు నానా తిప్పలు పడుతుంటారు.ఖరీదైన యాంటీ డాండ్రఫ్ షాంపూలను ఉపయోగిస్తారు.
అయితే షాంపూతోనే చుండ్రు పోతుంది అనుకుంటే పొరపాటే.కచ్చితంగా కొన్ని ఇంటి చిట్కాలను పాటించాలి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీతో శాశ్వతంగా చుండ్రు సమస్యను వదిలించుకోవచ్చు.అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు రెబ్బలు వేపాకు,( Neem ) మూడు మందారం పూలు( Hibiscus Flowers ) మరియు అర కప్పు బియ్యం నానబెట్టిన వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టీ స్పూన్ గడ్డ పెరుగు( Curd ), వన్ టీ స్పూన్ నిమ్మరసం( Lemon Juice
) వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం యాంటీ డాండ్రఫ్ షాంపూ ను ఉపయోగించి తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ విధంగా చేశారంటే మంచి ఫలితాన్ని పొందుతారు. """/" /
వేపాకు, మందారం ఇవి రెండు చుండ్రును వదిలించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
వేప ఆకులు, మందారంలో యాంటీ ఫంగల్( Antifungal ) మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.
ఇవి చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ను నాశనం చేస్తాయి.స్కాల్ప్ మరియు జుట్టు యొక్క పీహెచ్‌ని సమతుల్యం చేస్తాయి.
చుండ్రు సమస్యను సులభంగా మరియు వేగంగా వదిలిస్తాయి. """/" /
చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌తో పోరాడటంలో లెమన్ జ్యూస్ కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.
నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ స్కాల్ప్‌ను ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.ఇక పెరుగు, రైస్ వాటర్ జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి.
జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.మరియు హెయిర్ ఫాల్ సమస్యను తగ్గిస్తాయి.
ఆ విషయంలోనే నాగచైతన్య ప్రేమలో పడిపోయా.. శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు!