ఈ హోమ్ మేడ్ మౌత్ వాష్ తో నోటి దుర్వాసనకు చెప్పండి బై బై!

నోటి దుర్వాసన లేదా బ్యాడ్ బ్రీత్.( Bad Breath ) ఆడా మగా అనే తేడా లేకుండా చాలా మంది ఈ సమస్యతో సతమతం అవుతూ ఉంటారు.

ఉదయం శుభ్రంగా బ్రష్ చేసినప్పటికీ కూడా నోటి నుంచి దుర్వాసన మాత్రం వస్తూనే ఉంటుంది.

ఈ సమస్య కారణంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా అసౌకర్యానికి గురవుతుంటారు.కాన్ఫిడెన్స్ ని కోల్పోతారు.

నోటి దుర్వాసన వల్ల ఎదుటివారు ఎక్కడ తమను హేళన చేస్తారో అని భయపడిపోతుంటారు.

ఈ క్రమంలోనే నోటి దుర్వాసన సమస్యను వదిలించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.

? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ మౌత్ వాష్ మీకు చాలా బాగా సహాయపడుతుంది.

"""/" / ఈ మౌత్ వాష్ తో( Mouthwash ) నోటి దుర్వాసన సమస్యకు బై బై చెప్పవచ్చు.

మరి ఇంతకీ ఆ మౌత్ వాష్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాసు మినరల్ వాటర్ పోసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ వంట సోడా( Baking Soda ) మరియు గుప్పెడు పుదీనా ఆకులు( Mint Leaves ) వేసుకోవాలి.

చివరిగా రెండు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి.

ఈ మౌత్ వాష్ ను వారం రోజుల పాటు వాడుకోవచ్చు. """/" / రోజూ ఉదయం మరియు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న మౌత్ వాష్ ను నోట్లో వేసుకుని కనీసం ఐదు నిమిషాల పాటు పుక్కిలించి ఉమ్మేయాలి.

ఆ తర్వాత నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.మౌత్ వాష్ ను ఉపయోగించే ముందు కచ్చితంగా బాటిల్ ను షేక్ చేయాలి.

ఇక ఈ హోమ్ మేడ్ మౌత్ వాష్ ను వాడటం వల్ల అదిరే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

పుదీనా, బేకింగ్ సోడా మరియు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ లో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి ఆరోగ్యాన్ని పెంచుతాయి.

నోటిలో బ్యాక్టీరియా ని నాశనం చేస్తాయి.బ్యాడ్ బ్రీత్ సమస్యకు అడ్డుకట్ట వేస్తాయి.

అలాగే ఈ మౌత్ వాష్ ను వాడటం వల్ల చిగుళ్ల నుంచి రక్తస్రావం, చిగుళ్ల వాపు వంటివి సైతం దూరం అవుతాయి.

ఒక్క దెబ్బతో చుండ్రు పోవాలా.. అయితే ఈ టోనర్ మీకోస‌మే!