వారానికి ఒక్కసారి ఈ ఆయిల్ వాడితే హెయిర్ ఫాల్ కు టాటా చెప్పేయొచ్చు!!

ఆరోగ్యమైన, ఒత్తైన కురులను దాదాపు ఆడవారందరూ కోరుకుంటారు.జుట్టు విషయంలో ఎంతో కేర్ తీసుకుంటారు.

ఖరీదైన హెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు.అయినా సరే కొందరిలో జుట్టు విపరీతంగా ఊడిపోతూనే ఉంటుంది.

జుట్టు రాలడాన్ని అడ్డుకునేందుకు ఏం చేయాలో తెలియడం లేదా.? అయితే అస్స‌లు వ‌ర్రీ అవ్వకండి.

ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ ను వారానికి ఒక్కసారి వాడితే హెయిర్ ఫాల్ సమస్యకు టాటా చెప్పేయొచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు కరివేపాకు మరియు మూడు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek ) వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్ట‌వ్‌ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో అర కప్పు కొబ్బరి నూనె, అర కప్పు బాదం నూనె, అర కప్పు ఆముదం వేసుకోవాలి.

అలాగే ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు, మెంతులు కూడా వేసి చిన్న మంటపై కనీసం 12 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి.

"""/" / అనంత‌రం స్టఫ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక క్లాత్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.

వారానికి ఒకసారి ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకొని కనీసం పదినిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

ఇక ఆయిల్ అప్లై చేసుకున్న నాలుగు గంటల తర్వాత లేదా మరుసటి రోజు తేలికపాటి షాంపూలు ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

ఈ ఆయిల్ జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఆముదం, కొబ్బరినూనె, బాదం నూనె, మెంతులు, కరివేపాకు లో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.

జుట్టు రాలడాన్ని అరికడతాయి.అలాగే హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తాయి.

జుట్టు నల్లగా ఒత్తుగా పెరిగేందుకు ఈ ఆయిల్ ఎంతగానో సహాయపడుతుంది.కాబట్టి హెయిర్ ఫాల్ తో వ‌ర్రీ అవ్వడం మానేసి ఈ ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

వీడియో వైరల్: నేనైతే అతడిపై దావా వేసేవాడిని.. ఆనంద్ మహీంద్రా