ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే హెయిర్ ఫాల్ సమస్యకు సులభంగా బై బై చెప్పవచ్చు!
TeluguStop.com
హెయిర్ ఫాల్ సమస్యతో బాగా సతమతం అవుతున్నారా.? జుట్టు రాలడాన్ని నివారించుకోవడానికి ముప్పతిప్పలు పడుతున్నారా.
? ఖరీదైన ఆయిల్, షాంపూ వాడిన ఎలాంటి ఫలితం ఉండట్లేదా.? డోంట్ వర్రీ.
హెయిర్ ఫాల్ సమస్య( Hair Fall Problem )కు కారణాలు అనేకం.అలాగే దాన్ని నివారించుకోవడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే హెయిర్ ఫాల్ సమస్యకు సులభంగా బై బై చెప్పవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి. """/" /
ముందుగా ఒక కలబంద ( Aloe Vera )ఆకుని తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడగాలి.
ఇలా కడిగిన కలబందను ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్ లో వేసుకోవాలి.
అలాగే అదే బౌల్ లో మూడు టేబుల్ స్పూన్లు మెంతులు,( Fenugreek ) ఒక చిన్న కప్పు వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు మిక్సీ >జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న మెంతులు కలబంద ముక్కలు వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
"""/" /
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు ఆముదం( Castor Oil ) కలపాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.ఈ రెమెడీ మీ కురులను హెల్తీగా స్ట్రాంగ్ గా మారుస్తుంది.
హెయిర్ ఫాల్ సమస్య( Hair Fall Problem )కు అడ్డుకట్ట వేస్తుంది.జుట్టు ఎంత తీవ్రంగా రాలుతున్న సరే ఈ రెమెడీని పాటించడం స్టార్ట్ చేస్తే సమస్య దెబ్బకు అదుపులోకి వస్తుంది.
కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.
డ్రెస్ కూడా మార్చుకోనివ్వరా… పోలీసుల తీరుపై మండిపడిన బన్నీ!