ఈ యాంటీ ఏజింగ్ క్రీమ్ తో ముడతలకు చెప్పండి బై బై..?

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలోనే కాదు ముఖంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.

కండరాలు పటుత్వాన్ని కోల్పోయి ముడతలు, చర్మం సాగటం, గీతాలు పడటం వంటివి తలెత్తుతాయి.

అయితే ఇటీవల రోజుల్లో చిన్న వయసులో కూడా కొందరు ముడతలు( Wrinkles ) సమస్యను ఫేస్ చేస్తున్నారు.

ఏ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే అస్స‌లు వ‌ర్రీ అవ్వకండి.

ఇప్పుడు చెప్పబోయే హోమ్‌ మేడ్ యాంటీ ఏజింగ్ క్రీమ్ ను( Anti Aging Cream ) కనుక వాడితే ముడతలకు సులభంగా బై బై చెప్పవచ్చు.

చర్మాన్ని యవ్వనంగా మెరిపించుకోవచ్చు. """/" / క్రీమ్ తయారీ కోసం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు వాసెలిన్( Vaseline ) వేసుకోవాలి.

అలాగే పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు,( Turmeric ) వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్,( Lemon Juice ) వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, రెండు చుక్కలు విటమిన్ ఇ ఆయిల్ వేసి స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేయాలి.

రెండు నిమిషాల పాటు కలిపితే మన యాంటీ ఏజింగ్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది.

ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి. """/" / రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి మేకప్ ఏమైనా ఉంటే తొలగించి ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసి పూర్తిగా చర్మం లోపలికి ఇంకిపోయేలా మసాజ్ చేసుకోవాలి.

నిత్యం ఈ క్రీమ్ ను కనుక వాడితే ముడతలు క్రమంగా మాయం అవుతాయి.

చర్మం టైట్ గా బ్రైట్ గా మారుతుంది.ఈ న్యాచురల్ క్రీమ్ చర్మాన్ని యవ్వనంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.

చర్మ ఆరోగ్యానికి అండగా ఉంటుంది.కాబట్టి ముడతలు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న క్రీమ్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

పగుళ్లను మాయం చేసి పాదాలను మృదువుగా మార్చే ఎఫెక్టివ్ ఇంటి చిట్కాలు మీకోసం!