మొదలైన సపోర్ట్ మూవీ థియేటర్స్ ఉద్యమం

కరోనా ఎఫెక్ట్ కారణంగా థియటర్లు పూర్తిగా మూతబడ్డాయి.సినిమా రిలీజ్ ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు దీంతో సినిమాలు రిలీజ్ చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలని నిర్మాతలు వెతుక్కుంటున్నారు.

ఒకప్పుడు సినిమా అంటే కచ్చితంగా థియేటర్ లోనే చూడాలి అని భావించే వారు.

ఇప్పుడు ఇంట్లోనే హోమ్ థియేటర్ పెట్టుకోవడం వలన థియేటర్ తో పెద్దగా పని ఏముంది అనే స్థితికి ప్రజలు కూడా వచ్చేశారు.

వారికి కావాల్సిన సినిమాని ఓటీటీ చానల్స్ ద్వారా నేరుగా ఇంట్లోనే కూర్చొని చూసేస్తున్నారు.

భవిష్యత్తులో ఇది మరింత సులభతరం అయిపోయే అవకాశం ఉంది.థియేటర్లు ప్లేస్ లోకి ఓటీటీ చానల్స్ వచ్చేసి సినిమా మార్కెట్ ని ఆక్యుపై చేసేసుకుంటే ఇక థియేటర్లు మీద ఆధారపడి బ్రతికేవారు రోడ్డు మీద పడాలి.

ఇక థియేటర్లని కల్యాణ మండపాలుగా మార్చుకోవాలి.ఈ పరిస్థితి రావడానికి ఎంతో కాలం పట్టేలా లేదు.

ఈ నేపథ్యంలో ముందుగానే ఈ ప్రమాదంపై మేల్కొన్న థియేటర్ యజమానులు వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఈ క్రమంలో మొదలైందే సపోర్ట్ మూవీ థియేటర్స్ ఉద్యమం ఆన్ లైన్ లో మొదలైన ఈ ఉద్యమం కొద్దిసేపట్లోనే అన్ని పరిశ్రమల చిత్ర ప్రముఖులను కదిలించింది.

ప్రతి ఒక్కరూ సపోర్ట్ మూవీ థియేటర్స్ ఉద్యమంలో భాగం సేవ్ సినిమా అంటూ నినదిస్తున్నారు.

బోనీ కపూర్, శోభు యార్లగడ్డ వంటి ప్రముఖ నిర్మాతలు, నటులు మంచు విష్ణు, ఐశ్వర్య రాజేశ్ తదితరులు కూడా సేవ్ సినిమా అంటూ తమ గళం వినిపిస్తున్నారు.

సినిమా బ్రతకాలంటే సినిమా థియేటర్లు కచ్చితంగా ఉండాలని చాలా మంది సినీ ప్రముఖులు భావిస్తున్నారు.

మంచి సినిమాని థియేటర్ లో ప్రేక్షకుల మధ్య కూర్చొని చూస్తే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుందని భావిస్తున్నారు.

థియేటర్లు లేకపోతే స్టార్ హీరోల సినిమాలకి ఈలలు, గోలలు అస్సలు వినిపించవు.దీనిని దృష్టిలో ఉంచుకొని వారు కూడా ఈ సేవ్ మూవీ థియేటర్స్ కి మద్దతుగా నిలబడుతున్నారు.

టిడిపి హై కమాండ్ అక్షింతలు ? నేడు కార్యకర్తలకు ఆ ఎమ్మెల్యే ఏం చెప్తారో ?