గుండెపోటుతో తుది శ్వాస విడిచిన యువ క్రికెటర్..!

ఐపీఎల్ సీజన్ ముగిసి ఉత్కంఠభరితమైన టీ-20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న శుభవేళ ఓ దుర్వార క్రికెట్ అభిమానులందరినీ తీవ్ర నిరాశలో ముంచెత్తుతోంది.

ఉజ్వల భవిష్యత్తున్న ఓ 29 ఏళ్ల యువ క్రికెటర్ నూరేళ్లు నిండకుండానే నేల మీద నుంచి నిష్క్రమించాడు.

అతడి ఆకస్మిక మరణంతో ప్రస్తుతం తీవ్ర విషాదం నెలకొంది.శుక్రవారం సౌరాష్ట్ర యువ క్రికెటర్‌ అయిన అవి బరోట్‌ హఠాన్మరణం చెందాడు.

ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది.శుక్రవారం అవి బరోట్‌ అహ్మదాబాద్‌లోని తన నివాసంలో చెన్నై-కోల్‌కతా మధ్య ఐపీఎల్‌ మ్యాచ్ చూస్తుండగా అతడికి గుండెపోటు వచ్చింది.

దీంతో అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు.ఈ యువ క్రికెటర్ కు ఇటీవలే పెళ్లయ్యింది.

కాగా అతడు తన భార్య, తల్లితో కలిసి నివసిస్తున్నాడు.ప్రస్తుతం అతడి భార్య నాలుగు నెలల గర్భవతి కాగా ఆమె ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరవుతోంది.

”బరోట్‌ చనిపోయాడన్న వార్త వినగానే మేమంతా దిగ్భ్రాంతికి గురయ్యాం.అవి బరొట్ అక్టోబర్ 15న సాయంత్రం గుండెపోటుతో కన్నుమూసాడు.

బరోట్‌ సౌరాష్ట్ర క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక స్థానం తెచ్చుకున్నాడు.అతడు మరణించి జట్టులో తీరని లోటు మిగిల్చాడు” అని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ తీవ్ర భావోద్వేగంతో ఒక ప్రకటన విడుదల చేసింది.

"""/"/ ‘‘బరోట్‌ ఆకస్మికంగా గుండెపోటుకు గురయ్యాడు.హాస్పటల్ కు తీసుకెళ్లే క్రమంలో చనిపోయాడు.

ఇప్పటికీ అతని మరణాన్ని నమ్మలేకపోతున్నాం.హరియాణా నుంచి సౌరాష్ట్రకు వచ్చి ఇక్కడ కెరీర్‌ ఆరంభించాడు’’ అని సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్ ప్రెసిడెంట్ జయ్‌దేవ్‌ షా పేర్కొన్నాడు.

"""/"/ కుడి చేతివాటం వికెట్‌కీపర్‌ కమ్ బ్యాట్స్‌మన్‌ అయిన బరోట్‌ 38 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు.

వీటిల్లో 1547 పరుగులు చేసి రికార్డ్ సృష్టించాడు.38 లిస్ట్‌-ఎ మ్యాచ్‌ల్లో 1030 పరుగులు.

20 దేశవాళీ టీ20 మ్యాచ్‌ల్లో 717 పరుగులు చేశాడు.2015-16, 2018-19 సీజన్లలో రంజీ ట్రోఫీ ఫైనల్‌ చేరిన సౌరాష్ట్ర జట్టులో బరోట్‌ ఒక సభ్యుడిగా ఉన్నాడు.

బరోట్‌ 2011లో అండర్‌-19 భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.ఈ సీజన్లో కూచ్‌ బెహర్‌ టోర్నీలో నాలుగు సెంచరీలు, మూడు అర్ధసెంచరీలు సాధించి టీమ్ టైటిల్‌ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు.

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ మరోసారి విచారణ