సౌదీ షాకింగ్ డెసిషన్...ఆ తప్పుచేస్తే రూ. 2 కోట్లు జరిమానా...15 ఏళ్ళ జైలు శిక్షట...!!!

అరబ్బు దేశమైన సౌదీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది సంచలనానికి కేంద్ర బిందువుగా ఉంటుంది.

తమ దేశ గౌరవానికి, రూల్స్ కి విరుద్దమైన ఎలాంటి కార్యకలాపాలు ఎవరు చేపట్టినా సరే కటినమైన శిక్షలు విధిస్తుంది.

తమ దేశాభివృద్ధి కోసం ఇతర దేశాలలో ఉన్న నిపుణులను, కార్మికులను ఆకర్షించడానికి వీసాల జారీలో భారీ మార్పులు తీసుకురావడం, భారీ పెట్టుబడులను ప్రోశ్చహించేందుకు గాను గోల్డెన్ వీసా వంటి ఆకర్షణీయమైన వీసా పధకాలను తీసుకురావడం ఇలా ఎన్నో మార్పులు చేర్పులను చేపట్టిన సౌదీ తాజాగా తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించే అక్రమ వలస వాసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

సౌదీ లోకి అక్రమంగా చొరబడే వారిపై ఇప్పటికే పలు శిక్షలను అమలు చేస్తున్న సౌదీ తాజాగా అక్రమ చొరబాటుదారులకు సహకరించే వారిపై ఊహించని విధంగా శిక్షలు అమలు చేసేందుకు ప్రణాలికలు సిద్దం చేసింది.

తాజాగా సౌదీ పబ్లిక్ ప్రోసెక్షన్ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది.

అక్రమంగా సౌదీలోకి వస్తున్న వారికి సహకరించినట్లు తెలిస్తే వారిపై ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వం ప్రకటించింది.

వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.కాగా.

నేరం నిర్ధారణ అయితే మాత్రం నేరస్తులకు రూ.2 కోట్ల జరిమానా విధిస్తామని, దాంతో పాటు 5 నుంచీ 15 ఏళ్ళ జైలు జీవితం గడపాల్సి ఉంటుందని ప్రకటించింది.

అంతేకాదు అక్రమ వలస దారులకు సహకరించి వారి ఇంటిలో ఆశ్రయం కల్పించిన వారికి జరిమానా, జైలు జీవితంతో పాటుగా వారి ఇంటిని సీజ్ చేస్తామని వెల్లడించింది.

7/27/1442 రాయల్ ఆర్డర్ No A/406 తో పాటుగా 7/2/1443 రాయల్ ఆర్డర్ ప్రకారం శిక్షలు విధిస్తామని ప్రకటించింది.

కాబట్టి సౌదీ లో ఉండే భారతీయులు ఎవరైనా సరే ఒకరికి సాయం చేసే ముందు అతడు అక్రమంగా సౌదీలోకి ప్రవేశించాడా లేదా అనే విషయాలు పరిగణలోకి తీసుకోవడం మంచిది.

ఆ వైసీపీ నేతను గెలిపించండి.. ఆ నేతకు అండగా దిల్ రాజు!