డ్రగ్స్ కేసులో భారతీయుడికి మరణశిక్ష .. సౌదీ అరేబియా కోర్ట్ సంచలన తీర్పు
TeluguStop.com
వృత్తి, ఉద్యోగాలు,లేదంటే కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చనే ఉద్దేశంతో వేలాది మంది భారతీయులు ప్రతియేటా గల్ఫ్ దేశాల్లో అడుగుపెడుతున్నారు.
అయితే వీరి అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని కొందురు ట్రావెల్ ఏజెంట్లు వీరిని మోసం చేస్తుంటారు.
అలా గల్ఫ్ దేశాల జైళ్లలో మగ్గుతున్న వారి సంఖ్య అంతా ఇంతా కాదు.
ఇదిలాఉండగా.సౌదీ అరేబియాలోని( Saudi Arabia ) ఒక న్యాయస్థానం ఉత్తరప్రదేశ్‌లోని( Uttar Pradesh ) మీరట్‌కు చెందిన వ్యక్తికి డ్రగ్స్ అక్రమ రవాణా( Drug Trafficking ) ఆరోపణలపై మరణశిక్ష విధించింది.
సౌదీ అరేబియాలోని భారత కాన్సులేట్ నుంచి మీరట్ జిల్లా యంత్రాంగం ద్వారా ఈ విషయమై లేఖ అందినట్లు మీరట్ ఎస్ఎస్‌పీ కార్యాలయం ధృవీకరించింది.
ముండలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాచౌటీ గ్రామానికి( Rachauti Village ) చెందిన జైద్ జునైద్‌కు( Zaid Junaid ) డ్రగ్స్ స్మగ్లింగ్ అభియోగాలపై మక్కాలోని కోర్టు మరణశిక్ష( Death Penalty ) విధించిందని రాయబార కార్యాలయం లేఖలో తెలిపింది.
పరిస్ధితిని వారు తెలుసుకునేలా బాధిత కుటుంబం నివసించే ఇంటి ప్రవేశద్వారం వద్ద నోటీసు కూడా అతికించారు.
ఈ వార్త తెలుసుకున్న జైద్ తండ్రి జుబేర్ , తల్లి రెహానాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
"""/" /
జైద్ సోదరుడు సుహైల్ మాట్లాడుతూ.సౌదీ అరేబియా అధికారులకు క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖలు చేయాలని తన తండ్రి ఇప్పటికే భారత ప్రభుత్వాన్ని అభ్యర్ధించారని.
మంగళవారం పిటిషన్ సమర్పించినట్లు తెలిపారు.జైద్ 2018లో సౌదీ అరేబియాకు వెళ్లి ఒక కంపెనీకి డ్రైవర్‌గా పనిలో చేరాడు.
తొలుత ఒక సంస్థలో ఉద్యోగం చేసిన అతను తర్వాత అల్ జాఫర్ కంపెనీలో చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే అతని వాహనం దొంగతనానికి గురైనప్పటి నుంచి జైద్‌కు కష్టాలు మొదలైనట్లుగా చెబుతున్నారు.
మూడు రోజుల తర్వాత సౌదీ పోలీసులు అతని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.రోడ్డు ప్రమాదంలో అది పాడైపోగా.
దాని యజమాని ఖర్చులను పొందేందుకు అతనిపై దావా వేశారు. """/" /
దీంతో ఆర్ధిక భారాన్ని తట్టుకోలేక జైద్ సదరు కంపెనీని విడిచి సౌదీ పోలీస్ అధికారికి వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేయడం ప్రారంభించాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
కొత్త ఉద్యోగంలో చేరిన మూడు నెలల తర్వాత జైద్ డ్రైవింగ్ చేస్తున్న వాహనంలో 700 గ్రాముల మాదక ద్రవ్యాలను పోలీసులు కనుగొని డ్రగ్స్ కేసులో అతనిని అరెస్ట్ చేశారు.
జనవరి 15, 2023న అరెస్ట్ అయిన జైద్ నాటి నుంచి జెద్దా సెంట్రల్ జైలులో( Jeddah Central Jail ) శిక్ష అనుభవిస్తున్నాడు.
భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని తన సోదరుడి ప్రాణాలను కాపాడుతుందని తాము ఆశిస్తున్నామని సుహైల్ అన్నారు.
జైద్ తండ్రి జుబేర్ మాట్లాడుతూ తన బిడ్డ సజీవంగా ఇంటికి తిరిగి వస్తే చాలన్నారు.
జైద్ మరో సోదరుడు సౌదీ అరేబియాలో ఇప్పటికే డ్రైవర్‌గా పనిచేస్తుండగా అతను తమ్ముడిని విడిపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.
బెడిసి కొట్టిన ట్రాక్టర్ స్టంట్స్.. వీడియో చూస్తే షాక్ అవుతారు..