బాత్రూమ్లో పడిపోయిన సత్యేంద్ర జైన్.. ఆస్పత్రికి తరలింపు
TeluguStop.com
ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు.తీహార్ జైలులో ఉన్న ఆయన బాత్ రూమ్ లో పడిపోయారు.
వెంటనే స్పందించిన జైలు అధికారులు ఆయనను దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు.
అయితే మూడు రోజుల క్రితం కూడా అస్వస్థతకు గురి కావడంతో సత్యేంద్ర జైన్ ను ఢిల్లీ పోలీసులు సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు.
కాగా మాజీ మంత్రి మనీ లాండరింగ్ కేసులో నిందితునిగా జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం స్టార్ హీరోలకు ధీటుగా ఉన్న స్నేహితుడు ఆర్టిస్ట్.. ఈ నటుడిని గుర్తు పట్టారా?