ఇచ్చావ్ లే తొక్కలో సలహా.. గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో సత్యదేవ్ షాకింగ్ కామెంట్స్?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవల విడుదల మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ లు కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే.

ఇటీవల దసరా పండుగ విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించడంతో ప్రస్తుతం చిత్ర బృందం సక్సెస్ మీట్ లో భాగంగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా నటుడు సత్యదేవ్ మాట్లాడుతూ పలు షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఇకపోతే గాడ్ ఫాదర్ సినిమాలో నటుడు సత్యదేవ్ పాత్ర గురించి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇందులో చిరంజీవిని ఢీకొట్టే పాత్రలో సత్యదేవ్ అద్భుతంగా నటించాడు.అసలు అన్నీ కూడా బాగా పండాయి.

అయితే ఆ సన్నివేశాలలో ధైర్యంగా ఎలా నటించాడు అన్న సీక్రెట్ ని తాజాగా సక్సెస్ మీట్ లో భాగంగా చెప్పేశాడు సత్యదేవ్.

తనకు ఐ సైట్ ఉంది అని లెన్స్ వాడతాను అని తెలిపారు.చిరంజీవితో సీన్ చేసినప్పుడు ఆ లెన్స్ తీసేసి ఆక్ట్ చేశాడట సత్యదేవ్.

ఆ ట్రిక్కు బాగానే వర్కౌట్ అయింది అని చెప్పుకొచ్చాడు.ఇకపోతే గాడ్ ఫాదర్ సినిమాలో పూరి జగన్నాథ్ కూడా కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే.

"""/"/ ఇందులో చిరంజీవికి పూరికి మధ్య సన్నివేశం కూడా ఒకటి ఉంది.అందులో కూడా పూరి జగన్నాథ్ బాగా నటించాడు.

అయితే చిరంజీవితో షూటింగ్ అనగానే పూరి జగన్నాథ్ కూడా సత్యదేవ్ లాగానే కొంచెం భయపడ్డాడట.

ఒక రోజు రాత్రి పూరి జగన్నాథ్ సత్యదేవ్ కి ఫోన్ చేసి.నువ్వు ఆల్రెడీ చిరంజీవి గారితో నటించావు కదా.

ఆయన ముందు ఎలా నటించాలో టిప్పు చెప్పు అని సత్యదేవ్ ని ప్రశ్నించగా.

అప్పుడు సత్యదేవ్ బాస్ తో నటించడం చాలా ఈజీ.ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడకు సరిపోతుంది అంటూ సలహా ఇచ్చాడట.

మరుసటి రోజు పూరీ జగన్నాథ్, సత్యదేవ్ కి ఫోన్ చేసి ఇచ్చావ్ లే.

తొక్కలో సలహా.నీకు సైట్ ఉంది.

నాకు లేదు.అని ఫోన్ పెట్టేసాడట.

ఇదే విషయాన్ని తాజాగా సత్యదేవ్ గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో భాగంగా చెప్పుకొచ్చారు.

పండ్ల తొక్కలతో మరింత అందంగా మెరిసిపోండిలా..!