కీర్తి సురేష్ కోసం సత్యదేవ్ ని కన్ఫర్మ్ చేసిన సెల్వ రాఘవన్

టాలీవుడ్ ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు సత్యదేవ్.తాజగా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకున్న ఈ యువ హీరోపై ఇప్పుడు పెద్ద నిర్మాతలు, దర్శకుల దృష్టి పడింది.

టాలెంట్ ఉన్న వాళ్ళు ఎప్పటికైనా సక్సెస్ అవుతారు అనేదానికి సత్యదేవ్ ప్రయాణమే ఉదాహరణ.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సైడ్ రోల్స్ చేసుకునే స్టేజ్ నుంచి హీరోగా ప్రస్తుతం టాలీవుడ్ లో గొప్ప నటుడు అనే ప్రశంసలు తెచ్చుకునే వరకు సాగింది.

ఇంకా ఈ ప్రయాణంలో మరింత ఎత్తుకి ఎదిగే అవకాశాలు ఈ మధ్యకాలంలో సత్యదేవ్ కి పెరుగుతున్నాయి.

స్టార్ హీరోయిన్ తమన్నాతో కన్నడ సూపర్ హిట్ మూవీ లవ్ మాక్ టైల్ రీమేక్ గా తెరకెక్కుతున్న గుర్తుందా శీతాకాలం సినిమాలో రొమాన్స్ చేయబోతున్నాడు.

ఓ విధంగా ఈ సినిమా అతని రేంజ్ పెంచేది చెప్పాలి.ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ని సత్యదేవ్ సొంతం చేసుకున్నాడు.

టాలెంటెడ్ దర్శకుడుగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సెల్వ రాఘవన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ఒక సినిమా చేయడానికి ఒకే చెప్పింది.

ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ కూడా ఇప్పటికే రిలీజ్ అయ్యింది.తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ కి జోడీగా సత్యదేవ్ ని దర్శకుడు సెల్వ రాఘవన్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది.

ఉమామహేశ్వర సినిమాలో సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ చూసి సెల్వ కీర్తి సురేష్ సాని కాయిధం సినిమాలో హీరోగా ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో రిలీజ్ అవుతుంది కాబట్టి సత్యదేవ్ తనని తాను ప్రూవ్ చేసుకుంటే అతని రేంజ్ మరింత పెరిగిపోవడం పక్కా అని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది.

తలనొప్పిని తరిమికొట్టే గసగసాలు.‌. ఇంతకీ ఎలా వాడాలో తెలుసా..?