యువ హీరో పాన్ ఇండియా అటెంప్ట్..!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ తన వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడు.సోలోగానే కాదు ఇంపార్టెంట్ రోల్ అనిపిస్తే వేరే హీరోల సినిమాల్లో కూడా నటిస్తున్నాడు సత్యదేవ్.

రీసెట్ గా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లో నటించిన సత్యదేవ్ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ నటించిన రామ్ సేతు మూవీలో కూడా చేశారు.

తెలుగులో డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలు చేస్తూ వస్తున్న సత్యదేవ్ తన నెక్స్ట్ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు.

ఈశ్వర్ కార్తీక్ డైరక్షన్ లో క్రైం యాక్షన్ థ్రిల్లర్ మూవీగ సత్యదేవ్ సినిమా వస్తుంది.

ఈ మూవీలో సత్యదేవ్ తో పాటుగా డాలీ ధనుంజయ, సత్యరాజ్ లు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

ఈ మూవీని హిందీలో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.గాడ్ ఫాదర్, రామ్ సేతు సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన సత్యదేవ్ ఈసారి డైరెక్ట్ గా సోలోగా తనని తాను ప్రమోట్ చేసుకుంటున్నాడు.

సత్యదేవ్ చేస్తున్న ఈ పాన్ ఇండియా అటెంప్ట్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

ఈ మూవీకి సంబందించిన మరిన్ని విషయాలు త్వరలో తెలుస్తాయి. సత్యదేవ్ సినిమాలో కంటెంట్ ఉంటే మాత్రం అతను కూడా నేషనల్ వైడ్ గా ఈ మూవీతో క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది.

కొలంబియా వర్సిటీలో ఇజ్రాయెల్ వ్యతిరేక అల్లర్లు .. భారీగా అరెస్ట్‌లు, న్యూయార్క్ పోలీసులపై ట్రంప్ ప్రశంసలు