మొదటిసారి తన భార్యను పరిచయం చేసిన హీరో సత్యదేవ్.. ఫొటోస్ వైరల్?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో నటుడు సత్యదేవ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు నటుడిగా మెప్పిస్తూ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు హీరో సత్యదేవ్‌.

నటుడిగా హీరోగా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నాడు సత్యదేవ్.ఇది ఇలా ఉంటే సత్యదేవ్ హీరోగా తాజాగా నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం.

సినిమా డిసెంబర్ 9న విడుదల కానుంది.నాగ శేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

లవ్ మాక్ టైల్ సినిమా ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది.ఈ నేపథ్యంలోనే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా గడుపుతున్నారు.

ఇది ఇలా ఉంటే చిత్ర బృందం తాగగా ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది.

ఈ సందర్బంగా హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ ఈ సినిమాలో నీకు ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు.

మరి నీ రియల్‌ హీరోయిన్‌ ను పరిచయం చేయొచ్చుగా అని సత్యదేవ్‌ ను స్టేజ్ పై కోరింది.

ఆమె కేవలం మీకు స్టైలింగ్‌ మాత్రమే చేయలేదు.మీ ప్రధాన బలం కూడా ఆవిడేనని తెలుసంటూ ఆమెను పరిచయం చేస్తే బాగుంటుందని చెప్పింది.

"""/"/ దీనికి సత్యదేవ్‌ బేబీ అంటూ తన భార్య దీపికను స్టేజ్ పైకి ఆహ్వానించాడు.

అతడి భార్యా కొడుకు స్టేజీపైకి రాగానే వారిని సరదాగా పలకరించింది తమన్నా.అప్పుడు సత్యదేవ్ తన భార్య గురించి మాట్లాడుతూ.

ఈ సినిమాలో నాకు కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌, స్టైలింగ్‌ అంతా దీపిక నే చేసింది అంటూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపాడు.

కాగా సత్యదేవ్‌, దీపికది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే.సత్యదేవ్‌ సినిమాలకు దీపిక కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వ్యవహరిస్తోంది.

అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాంగ్రెస్ రైతు ప్రభుత్వం.. మంత్రి తుమ్మల