సత్య భామ రిలీజ్ డేట్ వచ్చేసింది…కాజల్ అదరగొట్టిందా..?
TeluguStop.com
తెలుగు సినిమా చరిత్రలో హీరోయిన్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) ప్రస్తుతం పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయింది.
అయితే ఇప్పుడు అడపాదనప సినిమాల్లో కూడా నటిస్తుంది.ముఖ్యంగా సత్యభామ( Satya Bhama ) అనే సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తూ ఆ సినిమా మీద హైప్ ని తీసుకొచ్చింది.
ఇక ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లు నటిస్తుంది.అయితే ఈ సినిమాని మే 17 వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.
"""/" /
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ని సినిమా యూనిట్ చాలా కొత్తగా డిజైన్ చేశారు.
ఒక వీడియోను క్రియేట్ చేసి రిలీజ్ చేశారు.క్రైమ్ సీన్ నుంచి రికవరీ అయిన గన్ విడి పార్ట్స్ ని లోడ్ చేసి కాజల్ షూట్ చేయగా ఆ బుల్లెట్టు క్యాలెండర్ లో మే 17వ తేదీని టార్గెట్ చేస్తూ వెళ్లింది.
ఇక ఈ వీడియో చాలా కొత్తగా ఉంది.అలాగే ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాడు.
నవీన్ చంద్ర( Naveen Chandra ) అమరేంద్ర అనే ఒక పాత్రలో నటిస్తున్నాడు.
ఇక మేజర్ సినిమా దర్శకుడైన శశి కిరణ్ తిక్క( Shashi Kiran Thikka ) ఈ సినిమాకి సమర్పకులుగా వ్యవహరించాడమే కాకుండా స్క్రీన్ ప్లే అందించాడు.
ఇక సుమన్ చిక్కాల ఈ సినిమా ను రూపొందిస్తున్నారు. """/" /
ఇక మొత్తానికైతే ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధిస్తుందని సినిమా మొత్తం ఆశగా భావిస్తున్నారు.
మరి ఇలాంటి క్రమం లో ఈ సినిమా తో కాజల్ భారీ సక్సెస్ ని అందుకొని హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకి మరోసారి పునాదిని వేస్తుందా అనే అంశాలు కూడా లేవనెత్తుతున్నాయి.
మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా కోసం కాజల్ అభిమానులు మే 17వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే
.
వీడియో: వేగంగా వెళ్తూ బైక్ పైనుంచి కింద పడ్డ అమ్మాయి.. గాయాలు చూస్తే!!