పిండితో చేసిన దీపం వెలిగించడం వల్ల కలిగే ఫలితం ఏంటో తెలుసా?

శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అలాగే శనీశ్వరునికి విశేష పూజలు అందుతాయి.

ఈ దేవుళ్లకు ఎంతో ప్రీతికరమైన రోజుఈరోజు శనివారం కనుక భక్తులు విశేషమైన పూజలు అందిస్తారు.

అయితే దీపారాధన సమయంలో ఎవరి తాహతుకు తగ్గట్టుగా వెండి దీపాలు, కంచు, మట్టి తదితర వాటిలో దీపారాధన చేస్తూ ఉంటారు.

అయితే దీపారాధన చేయడానికి సరైన పద్ధతి పిండితో చేసిన ప్రమిదలలో దీపారాధన చేయడం వల్ల అనుకున్న కార్యక్రమాలు నెరవేరి, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.

శనివారం ఉదయం నిద్ర లేచి స్నానమాచరించి, పూజగదిని శుభ్రం చేసి మన ఇష్ట దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో ను తీసుకోవాలి.

అయితే వెంకటేశ్వర స్వామి ఎడమవైపున లక్ష్మీ దేవి అమ్మవారు ఉండాలి.ఆ ఫోటోను సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిగా భావించి పూజ చేయాలి.

వెంకటేశ్వర స్వామికి తులసి మాల అంటే ఎంతో ఇష్టమైనది.అందువల్ల తులసి మాలలు వేసి లేదా తులసి ఆకులతో అభిషేకం చేయడం ద్వారా స్వామివారు ప్రసన్నులు అవుతారు.

అయితే శనివారం స్వామివారిని పూజించేవారు బియ్యపు పిండితో చేసిన ప్రమిదలతో పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి.

అంతేకాకుండా మనకు ఉన్నటువంటి అప్పులు తీరిపోతాయి.మానసిక ప్రశాంతత కలుగుతుంది.

బియ్యపు పిండితో చేసిన దీపారాధన వల్ల స్వామి వారి అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి.

అయితే పూజ చేసుకుంటున్న సమయంలో శ్రీ వెంకటేశ్వర నామ స్తోత్రాలు పఠించాలి.లేదా ఓం నమో నారాయణ నమః మంత్రాన్ని పఠిస్తూ పూజ చేయాలి.

ఏడు శనివారాల తోపాటు, ఏడు బియ్యపు పిండి ప్రమిదలలో దీపారాధన చేయడం ద్వారా సకల సంతోషాలతో నిండి ఉంటారు.

పూజ అనంతరం స్వామివారికి నైవేద్యంగా చక్కెర పొంగలి, పులిహోర, కలాకండ్, పాలు పండ్లు మొదలైన వాటిని నైవేద్యంగా సమర్పించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.

ఈ పిండి ప్రమిదలు కొండక్కెముందే చక్కెర పొంగలి, గారెలు నైవేద్యంగా సమర్పించాలి.ఇలా ఏడు శనివారాలు చేస్తే అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు.

తలను మార్చేసే కొత్త సిస్టమ్‌ను చూశారా.. చూస్తే షాకే..?