కాజల్ అయితే ఎంటి? సత్యభామ తో ఏమాత్రం వర్కౌట్ అవలేదు !

చాలా ఏళ్లుగా కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal )సినిమా ఇండస్ట్రీలో ఉంది.

అయితేనే ఇప్పటి వరకు కెరియర్ లో చెప్పుకోదగ్గ పాత్ర ఒక్కటి కూడా లేదు పేరుకే అందాల చందమామ.

కేవలం హీరో పక్కన ఆడుతూ పాడుతూ ఉండే పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చింది.

మగధీర వంటి ఒక భారీ సినిమాలు నటించినా పేరు మొత్తం రామ్ చరణ్ రాజమౌళిలకే వెళ్ళింది కానీ కాజల్ ని ఎవరు గుర్తుపెట్టుకోలేదు.

ఇక యధావిధిగా హీరోయిన్స్ సీనియర్స్ అయ్యే కొద్ది అందరి లాగానే కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి చేసుకుని ఓ ఇంటిదయ్యింది.

అలాగే ఓ కొడుకు కూడా పుట్టాడు.మరి పెళ్లయ్యాక కూడా అవే వెకిలి పాత్రలు చేస్తే జనాలు అసహ్యించుకుంటారు.

మామూలుగానే పెళ్లయిన తర్వాత సినిమా చేస్తుంది అంటే ఆ హీరోయిన్ ని అప్పటి వరకు చూసిన కోణం కాస్త మారిపోతుంటుంది.

అందుకే కాజల్ తన సెకండ్ ఇన్నింగ్స్ లాగానే మొదలు పెట్టింది.అందుకే కాస్త కంటెంట్ ఉన్న సినిమా చేయాలని అనుకుందో ఏమో లేడీ ఓరియంటెడ్ సినిమాకి సైన్ చేసింది.

"""/" / సినిమా పేరు సత్యభామ( Satyabhama ) ప్రపంచవ్యాప్తంగా నేడే విడుదల అయింది.

పేరులోనే పవర్ ఉంది కానీ సినిమాలో అంత పవర్ కనిపించలేదు.పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన కాజల్ అగర్వాల్ కథ విషయంలో మాత్రం కాస్త ఆచితూచి అడుగు వేస్తే బాగుంటుంది అని అనిపించింది.

సినిమా కోసం ఎంచుకున్న లైన్ ఆ పాత్ర ఎన్నుకున్న తీరు అలాగే కాజల్ అగర్వాల్ పడ్డ కష్టం అన్నీ కూడా చాలా బాగున్నాయి కానీ కథనం మాత్రం బెడిసి కొట్టింది.

ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ తీసుకుని సత్యభామ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న కాజల్ అగర్వాల్ సినిమా కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు.

కానీ దర్శకుడి ఫెయిల్యూర్ చాలా చక్కగా కనిపిస్తుంది. """/" / ఇక సినిమాలో పెద్ద హీరో పెడితే కాజల్ అగర్వాల్ ని ఎవరు చూడరు కాబట్టి చిన్న హీరో అయిన నవీన్ చంద్ర ( Naveen Chandra )తో కానిచ్చేశారు.

సినిమా మాత్రం పూర్తిగా కాజల్ తన భుజాలపైనే మోసింది.యాక్షన్ సీన్స్ అదరగొట్టింది.

తన వంతు శ్రమ బాగానే పడిన ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సీన్స్ పెద్దగా ఏమీ లేకపోవడంతో ఆమె కష్టం పూర్తిగా బూడిదలు పోసిన పన్నీరులా మారినట్టే అనుకోవాలి.

ఎంతో కొంత కాజల్ ని చూసిన ఫీలింగ్ తో అయితే ప్రేక్షకులు సినిమా థియేటర్ నుంచి బయటకు వస్తాడు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!