మరో సారి ప్రస్తానం సినిమాని గుర్తుచేస్తున్న శర్వానంద్

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కెరియర్ లో వచ్చిన ప్రస్తానం మూవీ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాతో ఒక్కసారిగా తన కెరియర్ ఊపులోకి వచ్చింది.

అప్పటికే టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న శర్వానంద్ కి వరుసగా హిట్స్ పడ్డాయి.

దాంతో టాలీవుడ్ క్రేజీ యంగ్ హీరోగా మారిపోయాడు.ఇక ఆ సినిమా తర్వాత ఎక్కువగా కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రాలకి పరిమితం అయిపోయిన శర్వానంద్ మళ్ళీ చాలా కాలం తర్వాత అలాంటి డార్క్ స్టొరీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

సుదీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రణరంగం అనే టైటిల్ తో మాఫియా బ్యాక్ డ్రాప్ లో సినిమా రాబోతుంది.

డార్క్ క్రైమ్ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది అని అప్పట్లో టాక్ వినిపించింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఇందులో చాలా మాసివ్ గా కనిపిస్తున్న శర్వానంద్ సినిమా ఎలా ఉండబోతుంది అనేది తన పాత్రతో క్లారిటీ ఇచ్చేసాడు.

తాజాగా పడిపడి లేచే మనసు సినిమాతో ఫ్లాప్ కొట్టిన శర్వానంద్ ఈ సినిమాతో మరోసారి తనలోని నటుడుని బయటకి తీసుకొచ్చి ప్రస్తానం లాంటి ఇంటెన్సన్ ఎలిమెంట్స్ ని ఆవిష్కరించాబోతున్నాడు అని అర్ధమవుతుంది.

గేమ్ చేంజర్ సినిమా మీద శంకర్ కాన్ఫిడెంట్ ఏంటి..?