స్టేషన్ ఘన్పూర్ లో రాజయ్యని దెబ్బతీయడానికే సర్పంచ్ నవ్యను పోటీలో దింపుతున్నారా..?
TeluguStop.com
సర్పంచ్ నవ్య( SARPANCH NAVY A) తెలంగాణ రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారు ఉండరు.
స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారని డైరెక్ట్ మీడియా ముఖంగా ఆయన బండారాన్ని బయటపెట్టిన ధైర్యశాలి.
అలాంటి ఈమె జానకిపురం సర్పంచ్ గా చేస్తోంది.రాజయ్య లైంగికంగా వేధిస్తున్నారని, తన అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని మీడియా ముఖంగా చెప్పి చివరికి రాజయ్యకు( MLA RAJAIAH ) స్టేషన్ ఘన్పూర్ టికెట్ రాకుండా చేయడంలో ముఖ్య పాత్ర పోషించిందని చెప్పవచ్చు.
దీంతో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.ఓవైపు కడియం శ్రీహరి( Kadiyam Srihari ), మరోవైపు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య పోటాపోటీగా ప్రచార హోరును కొనసాగిస్తున్నారు.
"""/" / ఈ క్రమంలోనే రాజయ్య కూడా తనకు టికెట్ వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు.
కేసీఆర్( KCR ) నన్ను నమ్ముతారని , నేను ప్రజాక్షేత్రంలోనే ఉంటానని ఆయన మీడియా ముఖంగా చెబుతున్నారు.
ఇదే సమయంలో అనుకోని ట్విస్ట్ ఏర్పడుతోంది.ఘన్పూర్ లో నవ్య పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మీడియా ముఖంగా తెలియజేసింది.
"""/" / సీఎం కేసీఆర్( CM KCR ) నాకు అవకాశం ఇస్తే తప్పనిసరిగా పోటీ చేస్తానని, కెసిఆర్ మరియు కేటీఆర్( KTR ) నాపై దయ చూపాలని తెలియజేస్తోంది.
ఈ వ్యవహారం అంతా చూస్తే మాత్రం రాజయ్యను దెబ్బతీయడానికే ఆమె ఇలా చేసిందా అనేది అర్థమవుతుంది.
రాజయ్య చేసింది కొంచెం అయితే.నవ్య ఎక్కువ చేసిందా అనేది అర్థమవుతుంది.
రాజయ్య ఎలాగైనా ప్రజా క్షేత్రంలోని ఉంటాను అంటున్నారు కాబట్టి ఆయనను పూర్తిగా రాజకీయంగా దెబ్బతీసేందుకే నవ్య వెనకాల ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.
తాజాగా నవ్య ఎమ్మెల్యేగా చాన్స్ వస్తే నిలుచుంటాను అనడం వెనుక తప్పనిసరిగా ఏదో పెద్ద హాండే ఉన్నట్టు అర్థమవుతుంది.
ఈ ఆలోచన అంతా రాజయ్యను పూర్తిగా దెబ్బతీయడం కోసమే చేసినట్టు కనిపిస్తోంది.
ఏది ఏమైనా ఎవరు తోడుకున్న గోతిలో వారు పడతారు అన్నట్టు రాజయ్య( MLA RAJAIAH )చేసిన తప్పులతో చివరికి రాజకీయ భవిష్యత్తు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.
సమంత తండ్రి మరణించినా ఆమెను ఓదార్చని సెలబ్రిటీలు.. ఇది మరీ దారుణం!