కరీంనగర్ జిల్లా వన్నారంలో సర్పంచ్ వినూత్న నిరసన

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారంలో సర్పంచ్ వినూత్న నిరసనకు దిగారు.ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో తలుపులు వేసుకుని స్వీయ నిర్బంధం చేసుకున్నారు.

గ్రామంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని సర్పంచ్ లక్ష్మీ డిమాండ్ చేశారు.తన మాటలను అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని, లేని పక్షంలో తన పదవికి రాజీనామా చేస్తానని ఆమె వెల్లడించారు.

ఆ సినిమా నాకు పెద్ద గుణపాఠం నేర్పింది… దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు ?