సర్‌ప్రైజ్‌ రివీల్‌ చేసిన ‘సర్కారు వారి పాట’ మేకర్స్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 27వ చిత్రం సర్కారు వారి పాట నుండి సర్‌ ప్రైజ్‌ రాబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రేపు మహేష్‌ బాబు బర్త్‌డే సందర్బంగా సర్కారు వారి పాట చిత్రంకు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.ఈ మోషన్‌ పోస్టర్‌ కోసం సంగీతంను థమన్‌ ఇచ్చాడు.

దర్శకుడు పరశురామ్‌ మరియు థమన్‌ లు కలిసి చాలా కష్టపడి ఆ ట్యూన్‌ తయారు చేశారట.

మైత్రి మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌తో కలిసి మహేష్‌బాబు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు.

భారీ బడ్జెట్‌తో భారీ అంచనాల నడుమ విభిన్నమైన కథాంశంతో రూపొందబోతున్న ఈ చిత్రంకు సంబంధించిన థీమ్‌ ఏంటీ అనేది రేపు విడుదల కాబోతున్న మోషన్‌ పోస్టర్‌ ద్వారా చూపించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

రేపు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు సోషల్‌ మీడియా ద్వారా మోషన్‌ పోస్టర్‌ విడుదల కాబోతున్నారు.

మరో వైపు ట్విట్టర్‌లో మహేష్‌బాబు ఫ్యాన్స్‌ సందడి కొనసాగుతోంది.

సంక్రాంతికి వస్తున్నాం మమ్మల్ని బావి నుంచి బయటపడేసింది.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు!