అత్యధిక వసూళ్లు సాధించిన ప్రాంతీయ సినిమాగా సర్కారు రికార్డ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చుసిన సినిమా సర్కారు వారి పాట.మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కారు వారి పాట' సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని మే 12న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

మహేష్ బాబు వరుస హ్యాట్రిక్ సినిమాల తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై ముందు నుండి అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.ఎన్నో అంచనాల మధ్య మహేష్ బాబు సర్కారు వారి పాట థియేటర్ లలోకి వచ్చి తొలిరోజే మిశ్రమ స్పందన అందుకుంది.

అయితే ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ తో దూసుకు పోతుంది.మేకర్స్ చెబుతున్న లెక్కల ప్రకారం ఈ సినిమా అంతటా కలిపి రెండవ వారంలోనే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసిందట.

ఇప్పటికే సర్కారు సినిమా 100 కోట్ల షేర్ మార్క్ ను క్రాస్ చేసింది.ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 196.

1 కోట్ల గ్రాస్ రాబట్టి 200 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టడానికి సిద్ధం అవుతుంది.రెండవ వారం కూడా కలెక్షన్స్ పర్వాలేదు అనిపించడంతో బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేసిందట.

< --> ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సర్కారు వారి పాటతో మహేష్ బాబు టాలీవుడ్ లో అన్ని సినిమాల బాక్సాఫీస్ రికార్డ్స్ ను బద్దలు కొట్టి మరీ అత్యధిక వసూళ్లు సాధించిన ప్రాంతీయ సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

< -->మహేష్ కెరీర్ లో వరుసగా నాలుగవ సినిమా 100 కోట్ల+ షేర్ సాధించిన సినిమాగా నిలిచింది.మేకర్స్ చెబుతున్న ప్రకారం ఈ సినిమా 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 153.

8 కోట్లు, KA + ROI కలిపి 14.9 కోట్లు, ఓవర్సీస్ లో 27.

4 కోట్ల వసూళ్లు సాధించగా మొత్తం కలిపి 196.1 కోట్లు సాధించింది.

డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా మహేష్ బాబు స్టామినా ఏంటో తెలియజేసింది.ఏది ఏమైనా సర్కారు వారి పాట సినిమా మాత్రం మహేష్ కెరీర్ లో మరొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి.

క్లిక్ పూర్తిగా చదవండి

విద్యుత్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుః తెలంగాణ‌లో నిర‌స‌న సెగ‌

పర భాషా చిత్రాలలో సత్తా చాటుతున్న మన తెలుగు కమెడియన్స్ వీళ్ళే !

ఇంద్ర‌కీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత‌

అమ్మాయిలు-అబ్బాయిలూ ఈ యాప్ మీ ఫోన్లో వుందా? ఇదొక్కటి చాలు, ఎవరికీ, దేనికి భయపడక్కర్లేదు!

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యయత్నం నిందితుడుని పట్టుకున్న పోలీసులు..

బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

array(4) { [0]=> int(12) [1]=> int(31226) [2]=> int(31224) [3]=> int(31221) } Posts categoryid===

నిశ్వికా నాయుడు అందాల విందు