అక్షరాలా 200 కోట్ల రూపాయిలు..బుల్లితెర మీద సూపర్ స్టార్ ప్రభంజనం!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఆయన సినిమాకి ఈమధ్య టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు వస్తున్నాయి.ఇది ఎన్ని పాన్ ఇండియన్ సూపర్ హిట్ సినిమాలు తీసిన రానటువంటి క్రేజ్ అని చెప్పొచ్చు.

ఆయన గత చిత్రాల వసూళ్లను చూస్తే ఈ విషయం అందరికీ అర్థం అవుతుంది.

మహేష్ సినిమాలకు అంత వసూళ్లు రావడానికి కారణం ఆయనకీ ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్నటువంటి క్రేజ్ వల్లే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

సందేశాత్మక చిత్రాలు తీస్తూ ఉండడం వల్ల మహేష్ కి గత దశాబ్ద కాలం లో ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్ విపరీతంగా పెరిగింది.

అది కలెక్షన్స్ రూపం లో అందరికీ అర్థం అవుతుంది.కేవలం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లోనే కాదు, బుల్లితెర రికార్డ్స్ లో కూడా మహేష్ కి పోటీని ఇచ్చే స్టార్ హీరో లేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

"""/" / గత దశాబ్ద కాలం లో టీవీ లో టెలికాస్ట్ అయిన మహేష్ సినిమాల లిస్ట్ తీసుకుంటే ప్రతీ చిత్రానికి అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ రావడం కామన్ అయిపోయింది.

మొదటి టెలికాస్ట్ లో ఆశించిన అభిమానులు ఊహించిన రేంజ్ రేటింగ్స్ వచ్చినా రాకపోయినా, రిపీట్ టెలికాస్ట్ లో మాత్రం దంచి కొట్టేస్తున్నాయి.

ఉదాహరణకి మహర్షి సినిమాని ఇప్పటికిప్పుడు జెమినీ టీవీ లో టెలికాస్ట్ చేస్తే 5 టీఆర్ఫీ రేటింగ్స్ కి తక్కువ రాదు.

రీసెంట్ గా విడుదలైన కొత్త సినిమాలకే ఈ రేంజ్ వసూళ్లు రావడం లేదు, అలాంటిది మహర్షి చిత్రానికి వస్తుందంటే ఆ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

అదే జెమినీ టీవీ లో మహేష్ నటించిన 'సరిలేరు నీకెవ్వరూ( Sarileru Neekevvaru )' చిత్రానికి కూడా ఇదే రేంజ్ టీఆర్ఫీ రేటింగ్స్ వస్తున్నాయి.

రీసెంట్ గానే ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చెయ్యగా , నాలుగు కి పైనే రేటింగ్స్ వచ్చాయట.

"""/" / ఇలా ఆ రెండు సినిమాలకు రిపీట్ టెలికాస్ట్ లో అద్భుతమైన రేటింగ్స్ రావడం కారణంగా, కేవెలం ఈ సినిమాల నుండి 200 కోట్ల రూపాయిలు లాభాలు వచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న టాక్.

మహేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ.

అలాంటి మహేష్ ఫ్యామిలీ ఆడియన్స్ తనతో సమానమైన క్రేజ్ ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి 'గుంటూరు కారం( Guntur Kaaram) ' అనే చిత్రం చేసాడు.

జనవరి 12 వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని అద్భుతాలు నెలకొల్పబోతుందో చూడాలి.

పుష్ప 2 ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?