చెన్నై స్టోర్‌లో చీరలు చోరీ.. ఈ మహిళలు ఎలా దొరికిపోయారో చూడండి..

ఈరోజుల్లో మగవారే కాదు ఆడవారు కూడా దొంగతనంలో ఆరితేరుతున్నారు.పట్టపగలే ధైర్యంగా చోరీలకు కూడా పాల్పడుతున్నారు.

ఇటీవల చెన్నై సిటీలోని టి నగర్‌లోని చీరల బొటిక్‌లో ముగ్గురు ముసుగులు ధరించిన మహిళలు 2 లక్షల రూపాయల విలువైన 10 కాంచీపురం పట్టు చీరలను( Kancheepuram Silk ) దొంగిలించారు.

వారి దొంగతనం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.ఆ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యింది, 48 లక్షలకు పైగా వ్యూస్, నెటిజన్ల నుంచి వివిధ స్పందనలు వచ్చాయి.

"""/" / ఎగ్జిబిషన్‌లో దొంగలు కస్టమర్లుగా నటించి చీరలను ఎలా చెక్ చేస్తూ నొక్కేసారో సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.

క్షణం కోసం వెయిట్ చేస్తూ హ్యాంగర్‌లతో పాటు చీరలను త్వరగా మడతపెట్టారు.ఆ తర్వాత చీరలను తమ చీరల కింద దాచిపెట్టి 10 నిమిషాల వ్యవధిలో బోటిక్ నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఎగ్జిబిషన్ హోస్ట్ వారి అనుమానాస్పద ప్రవర్తనను గమనించి సీసీటీవీ ఫుటేజీ( CCTV )ని పరిశీలించారు.

10 చీరలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముఠాలో దొంగలు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

"""/" / చీర చోరీకి సంబంధించిన వీడియోపై ఇన్‌స్టాగ్రామ్( Instagram ) యూజర్లు అనేక కామెంట్స్ చేశారు.

ఈ దొంగల నైపుణ్యం, వేగాన్ని చూసి కొందరు ఆశ్చర్యపోయారు.దొంగలు చీరల హ్యాంగర్‌లను పెట్టుకుని ఎలా నడుచుకున్నారనేది వారిలో కొందరిని కలవరపరిచింది.

నెటిజన్లు కొందరు దొంగల పట్ల సానుభూతి చూపారు.వారు పేదవారు అని మందలించి వదిలేయాలని అన్నారు.

అయితే, దొంగలు దొంగిలించిన చీరలను కొరియర్ ద్వారా పోలీస్ స్టేషన్‌కు తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో కథ ఊహించని మలుపు తిరిగింది.

చీరలు ఉన్న పార్శిల్‌తో పాటు ‘సారీ’ అని రాసి ఉన్న చీటీని పోలీసులు అందుకున్నారు.

ఈ వింత పశ్చాత్తాపం వెనుక కారణం తెలియరాలేదు.

పుష్ప ది రూల్ ఫస్ట్ డే టార్గెట్ అన్ని రూ.కోట్లా.. ఆ తప్పు మాత్రం మైనస్ కానుందా?