బిగ్ బాస్ హౌస్ లో ఆ ఒక్కరు తప్ప అందరూ ఫేక్.. సరయు కామెంట్స్ వైరల్?

బిగ్ బాస్ ఫేమ్, 7 ఆర్ట్స్ సరయు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇటీవలే ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి వారమే ఎలిమినేట్ అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే.

ఈమె యూట్యూబ్ లో పలు వీడియోస్ ద్వారా బాగా ఫేమస్ అయింది.నోరు తెరిస్తే చాలు బూతులు, ఆ బూతు లతోనే ఈమె బాగా పాపులర్ అయి బిగ్ బాస్ హౌస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

అయితే ఆమెకు ఉన్న నెగిటివిటీ కారణంగా ఈమె మొదటి వారం తట్ట బుట్ట సర్దుకుని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.

బిగ్ బాస్ హౌస్ లో సిగరెట్లు తాగడం, కారణం లేకుండా కాజల్ ను టార్గెట్ చేయడం వంటి వాటితో ఈమె మొదటి వారంలోనే ఎలిమినేట్ అయి బయటికి వచ్చేసింది.

ఈమె బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ లతో మంచిగానే ర్యాపో చేస్తుంది.

లోబో, నటరాజ్, ఉమాదేవి, సరయులు అందరూ కలిసి బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే సరయూ తాజాగా యాంకర్ రవి గురించి స్పందించింది.

"""/"/ ఈ క్రమంలోనే రవి గురించి ఒక పోస్టు పెట్టింది.అయితే రవి ఎలిమినేట్ అయ్యాడని అలాంటి పోస్ట్ పెట్టిందా? లేకపోతే రవి ఇంకా హౌస్ లోనే ఉంటాడని ఆ పోస్టు పెట్టిందో తెలియదు గానీ, రవికి సపోర్ట్ చెయ్యండి అంటూ కోరింది.

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడున్న వారంతా కూడా ఫేక్.ఒక్క రవి తప్ప అని సరయు చెప్పుకొచ్చింది.

రవికి మద్దతు తెలపండి అంటూ తన ఫ్యాన్స్ ని వేడుకుంది.అయితే రవి గురించి ఈమె చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

చదివిన పాఠశాలకు రూ.11 లక్షలు ఇచ్చిన ప్రముఖ నటుడు.. ఇతని మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!