కుల విభేదాలకు రాజకీయ నాయకులే కారణం.. శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు!

తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు శరత్ కుమార్ ( Sarath Kumar )ఒకరు.

ఎన్నో సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ప్రస్తుతం రాజకీయాలలో కూడా కొనసాగుతున్నారు.

తాజాగా శరత్ కుమార్ తమిళ్ క్కుడిగమన్( Tamil Kudimagan Movie ) అనే సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన కులమత విభేదాల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ. """/" / మనదేశంలో కులమత విభేదాలకు కారణం రాజకీయ నాయకులేనని(Politicians) ఈయన తెలియజేశారు.

ఒక మనిషి పుట్టినప్పుడు తన కులం ఏంటి అనే విషయం తెలియదు.పాఠశాలకు వెళ్తున్న సమయంలోను అలాగే కాలేజీకి వెళ్తున్న సమయంలోను కులమత బేధాలు( Caste And Religious Differences ) గురించి పట్టింపులు లేకుండా ప్రతి ఒక్కరు చాలా స్నేహభావంతో మెలుగుతూ ఉంటారని తెలిపారు.

అయితే ఎప్పుడైతే ఒక మనిషి రాజకీయాలలోకి వస్తారో అప్పుడే ఈ కులమత భేదాలు వస్తాయని తెలియజేశారు.

"""/" / ఇలా కులమత విభేదాలు వచ్చినప్పుడు వాటిని రూపుమాపడానికి వేరే రాజకీయం ఉందని ఈయన తెలియజేశారు.

అదే సమానత్వమని దానికోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఈయన సూచించారు.అయితే తాను కూడా రాజకీయాలలో ఉంటూ రాజకీయ నాయకుడు( Political Leader ) గానే కొనసాగుతున్నానని తెలిపారు.

కానీ సమానత్వం కోసమే తన భవిష్యత్తు కార్యక్రమాలన్ని ఉంటాయని ఈ సందర్భంగా శరత్ కుమార్ కులమత విభేదాల గురించి మాట్లాడుతూ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?