క్రిటికల్ గా మారిన శరత్ బాబు ఆరోగ్యం…
TeluguStop.com
సీనియర్ నటుడు శరత్ బాబు( Sharat Babu ) ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే మారింది.
మూడు రోజుల ముందు ఆయన్ని హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్లో ( AIG Hospitals, Hyderabad )జాయిన్ చేశారు.
అయితే శనివారం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఐసీయూలో నుంచి నార్మల్ వార్డుకి మార్చామని డాక్టర్స్ తెలిపారు.
అయితే మళ్లీ ఆదివారం ఆయన హెల్త్ కండీషన్ సీరియస్‌గా మారింది.దీంతో ఆయన్ని ఐసీయూ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఇన్ఫెక్షన్ కారణంగా శరరీంలో ప్రధాన అవయవాలైన కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు పాడైనట్లు సమాచారం.
ఇక సోమవారం కూడా అయన ఆరోగ్య పరిస్థితి అలానే ఉంది .కొన్ని గంటలకు గడిస్తే కానీ, చెప్పలేమని డాక్టర్స్ అంటున్నారు.
ప్రస్తుతం శరత్ బాబు వయసు 72 ఏళ్ళు .వయసు మీద పడటంతో పాటు పలు ఆరోగ్య సమస్యలతో ఆయన ఇబ్బంది బడుతున్నారు.
"""/" /
ఈ నేపథ్యంలోనే తాజాగా శరత్ బాబు హెల్త్ కండీషన్( Sarath Babu Health Condition ) గురించి వైద్యులు అప్డేట్ ఇచ్చారు.
శరత్‌బాబు పరిస్థితి ఇంకా విషమం గానే ఉందని వైద్యులు తెలుపుతున్నారు.ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు .
ఇక శరత్ బాబు 250కిపైగా సినిమాల్లో నటించారు.హీరోగా శరత్ బాబు తొలిచిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం.
తర్వాత కన్నెవయసు చిత్రంలో నటించారు.ఆ తర్వాత సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాలలో నటించారు.
తర్వాత తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు. """/" /
చివరిగా వకీల్‌సాబ్ సినిమాలో కనిపించారు.
ఓ పక్క మూవీస్‌లో నటిస్తూనే బుల్లితెరపైనా మంచి పాత్రలు పోషించారు.అనేక తెలుగు, తమిళ టీవీ సీరియళ్లలో నటించారు.
ఆయన అనారోగ్యానికి గురయ్యారనే వార్త టాలీవుడ్లో కలవరాన్ని నింపింది.ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా ఆయన కోరుకోవాలని పోస్ట్ లు షేర్ చేస్తున్నారు.పలువురు సినీ ప్రముఖులు అయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
మృతి చెందడానికి ముందు ఈ యువతి ఎంత హ్యాపీగా ఉందో చూస్తే..