పొత్తూరులో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేసిన సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్.

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వాఖ్యలపై మండిపడ్డ బీ.

ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు ఈరోజు ఇల్లంతకుంట మండలం పొత్తూర్ గ్రామంలో రేవంత్ రెడ్డి( Revanth Reddy ) దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

పొత్తురు గ్రామ డా.బీఆర్.

అంబేద్కర్ విగ్రహం ఎదుట సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసి ఆయనపై నిప్పులు చెరిగారు.

అమెరికా తానా సభల్లో బయటపడ్డ కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరి, తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ ను రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిదని ఆయన విమర్శించారు.

రైతులకు కేవలం మూడుగంటలు విద్యుత్ ఉచిత ఇస్తే చాలనడం రైతుల పట్ల ఆయన నీచ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనమన్నారు.

గతంలో విద్యుత్ ఇవ్వకుండా రైతులను( Farmers ) అరిగోస పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, రేవంత్ రెడ్డి పీసీసీ అయిన నాటి నుండే రైతులపై విషం కక్కుతున్నారని దీనికి కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో రైతుల చేతుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటుందని సిద్ధం శ్రీనివాస్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కదురు శేఖర్ , ఉప సర్పంచ్ బండారి పరశురాములు గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కరుణాకర్ రెడ్డి,మహేష్ నవీన్ సతీష్ అజయ్ గ్రామ రైతులు పాల్గొన్నారు.

ఏపీకి ప్రధాని మోదీ ..  ఎప్పుడు ఎందుకు ?