సినిమాల్లో నటించడం కోసం ఈ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి…!

బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రముఖ సెలబ్రిటీల కూతురు లేదా కొడుకులకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే 2018 సంవత్సరంలో బాలీవుడ్ ప్రముఖ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ కేదార్ నాథ్ అనే చిత్రం ద్వారా సినీ పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ చిత్రంలో హీరోగా స్వర్గీయ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించాడు.

కాగా తాజాగా గా సారా అలీ ఖాన్ కి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఫోటోని కనుక ఒకసారి పరిశీలించినట్లయితే సినిమాల్లోకి రాకముందు ఎంత లావుగా ఉండేదో స్పష్టంగా తెలుస్తోంది.

 అంతేకాక సినిమాల్లోకి రాకముందు తాను చాలా బరువు ఉండేదానినని సినిమాల కోసమే ప్రత్యేకంగా  జిమ్ మరియు వర్కౌట్ చేస్తూ చాలా బరువు తగ్గానని సారా అలీ ఖాన్ ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో తెలిపింది.

అంతేకాక మనకు ఏదైనా సాధించాలని పట్టుదల కలిగితే కచ్చితంగా సాధించవచ్చని తానుకూడా సినిమాల కోసం దాదాపుగా 15 నుంచి 20 కేజీల వరకు బరువు తగ్గానని తెలిపింది.

 అయితే సారా అలీ ఖాన్ అభిమానులు మాత్రం ఆమె బొద్దుగా ఉన్నా కూడా చాలా అందంగా ఉందని అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా  ప్రస్తుతం సారా అలీ ఖాన్ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న "కూలి నెంబర్ వన్" అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

 ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయినట్లు సమాచారం.

అలాగే బాలీవుడ్ సినీ పరిశ్రమకి చెందిన ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న మరో చిత్రంలో కూడా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

అందరి కళ్లూ యూకే సార్వత్రిక ఎన్నికలపైనే.. ప్రధాన అభ్యర్ధులు వీరే.?