సంతోష్ శోభన్ సినిమా రిలీజ్ ముందే లాభాలు..!
TeluguStop.com
యువి కాన్సెప్ట్ బ్యానర్ లో సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న సినిమా కళ్యాణం కమనీయం.
ప్రియా భవాని శకర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమాకు రిలీజ్ కు ముందే లాభాలు వచ్చినట్టు తెలుస్తుంది.సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమ్ముడవగా వాటి ద్వారా 7 కోట్ల దాకా వచ్చినట్టు టాక్.
సినిమా బడ్జెట్ మొత్తం అక్కడే కవర్ అవడమే కాదు లాభం కూడా వచ్చినట్టు తెలుస్తుంది.
ఇక థియేట్రికల్ రన్ లో ఎంత వచ్చినా అది బోనస్ అన్నమాట.యువి వారి ఈ ప్లాన్ భలేగా ఉంది.
సంతోష్ శోభన్ తో వారు అందుకే వరుస సినిమాలు చేస్తున్నారు.ఇక కళ్యాణం కమనీయం సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.
పెళ్లి తర్వాత వ్యక్తి జీవితంలో జరిగే మార్పులను సినిమాలో చూపించారు.కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుంది.
సంక్రాంతికి పెద్ద సినిమాలు వస్తుండగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్ ల జోడీ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది.
మరి ఈ సినిమా అనుకున్న విధంగా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.
కల్తీ నెయ్యిని గుర్తించేందుకు ఈ సింపుల్ టిప్స్ ను ఫాలో అవ్వండి..!