నెల గ్యాప్‌ లోనే రెండు సినిమాలతో వచ్చేలా ఉన్నాడే

యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మించిన ఏక్ మినీ కథ సినిమా తో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్‌ సక్సెస్ ను కూడా దక్కించుకున్న ప్రముఖ దర్శకుడు దివంగత శోభన్ తనయుడు సంతోష్‌ శోభన్‌ జోరు పెరిగింది.

ఇప్పటికే మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ వారు మంచి రోజులు వచ్చాయి అనే టైటిల్ తో సినిమాను చేయడం జరిగింది.

విడుదలకు సిద్దంగా ఉంది.థియేటర్ లేదా ఓటీటీ ఏ సమయంలో అయినా విడుదల తేదీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటిస్తారని అంటున్నారు.ఒక వైపు మంచి రోజులు వచ్చాయి సినిమా విడుదలకు సిద్దంగా ఉండగానే మరో సినిమా విడుదల కోసం రెడీ అయ్యింది అంటూ ప్రకటించారు.

సంతోష్‌ శోభన్ హీరోగా రూపొందిన ప్రేమ్‌ కుమార్ విడుదలకు సిద్దం అయ్యింది.అభిషేక్ మహర్షి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముగిసినట్లుగా తాజాగా ప్రకటించారు.

సినిమా విడుదల తేదీని అతి త్వరలోనే ప్రకటిస్తాము అంటూ యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

సినిమా షూటింగ్ ను సైలెంట్ గా ముగించేశారు.సినిమా చాలా వినోదాత్మకంగా ఉంటుంది అంటూ తాజాగా విడుదల అయిన పోస్టర్‌ మరియు వీడియోను బట్టి అర్థం అవుతుంది.

"""/"/ భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా కూడా అతి త్వరలోనే విడుదల అయ్యేలా ఉంది.

అంటే మంచి రోజులు వచ్చాయి మరియు ప్రేమక్ష కుమార్‌ సినిమా విడుదల తేదీలు చాలా తక్కువ గ్యాప్ లో ఉంటాయని తెలుస్తోంది.

రెండు సినిమాలు కూడా నెల గ్యాప్‌ లో వస్తాయనే నమ్మకంను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ఈమద్య కాలంలో నెల గ్యాప్ లో సినిమా అంటే మామూలు విషయం కాదు.

తండ్రి కి ఉన్న గుర్తింపు కారణంగా సంతోష్‌ శోభన్ కు మంచి ఆఫర్లు వస్తున్నాయి.

ఇది మంచి తరుణం.త్వరలోనే సంతోష్‌ స్టార్‌ అవుతాడేమో చూడాలి.

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇల్లు చూశారా.. ఇంత సింపుల్ గా ఉండటం డార్లింగ్ కే సాధ్యమా?