మీకు తెలుసా? మంచి రోజులు మళ్లీ వస్తున్నాయట!

ప్రతి రోజు పండుగే సినిమా ను సాయి ధరమ్‌ తేజ్ తో తెరకెక్కించి సక్సెస్ ను దక్కించుకున్న దర్శకుడు మారుతి కాస్త గ్యాప్ తీసుకుని సినిమా మొదలు పెట్టాలనుకున్నాడు.

ఇంతలో కరోనా వచ్చి మొత్తం ప్లాన్‌ రివర్స్ అయ్యింది.మారుతి సినిమా కోసం ప్రతి ఒక్కరు వెయిట్‌ చేస్తున్న సమయంలో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ అంటూ ప్రకటించాడు.

సినిమా ప్రారంభించే సమయంకు సెకండ్‌ వేవ్‌ వచ్చింది.దాంతో పక్కా కమర్షియల్‌ ఆలస్యం అయ్యింది.

ఆ సమయంలో అనూహ్యంగా అనెక్స్‌పెక్టెడ్ మూవీ అంటూ మారుతి నుండి మంచి రోజులు వచ్చాయి సినిమా వచ్చింది.

ఆ సినిమా కాస్త బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకోవడంలో విఫలం అయ్యింది.

నెగటివ్ రివ్యూలు మరియు నెగటివ్ ఫీడ్‌ బ్యాక్ వల్ల సినిమా వసూళ్లు నిరాశ పర్చాయి.

కాని సినిమా కోటి కి అటు ఇటుగానే బడ్జెట్‌ లో పూర్తి అయ్యింది.

సంతోష్‌ శోభన్ మరియు మెహ్రీన్ లు ఈ సినిమా లో నటించారు .

వారిద్దరు తప్ప మిగిలిన వారు అంతా కూడా పెద్దగా గుర్తింపు లేని వారే.

దాంతో సినిమా స్పీడ్ గా అయ్యింది.అలాగే తక్కువలో కూడా అయ్యిందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ఇక ఈ సినిమా ను ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

డిసెంబర్‌ 3వ తారీకున ఈ సినిమా ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

"""/" / భారీ ఎత్తున అంచనాలున్న సినిమా నిరాశ పర్చడంతో థియేటర్ లో వసూళ్లు నమోదు కాలేదు.

దాంతో ఓటీటీ లో అయినా సినిమా మంచి ఫలితాన్ని దక్కించుకుంటుందా అనేది చూడాలి.

ఈమద్య కాలంలో ఆహా వారు వరుసగా సినిమాలను ఇస్తున్నారు.మంచి రెస్పాన్స్ కూడా దక్కుతోంది.

కనుక ఈ సినిమా ను ఆహా లో ఖచ్చితంగా ఎక్కువ మంది చూస్తారని అంటున్నారు.

ఓటీటీ కి తగ్గట్లుగా ఎడిటింగ్ చేసినట్లుగా తెలుస్తోంది.

రామ్ చరణ్ అంటే నాకెంతో ఇష్టం.. మానుషి చిల్లర్ కామెంట్స్ వైరల్