వరుస సినిమాలతో తమ్ముడు జోరు… వరుస ఫ్లాప్ లతో అన్న బేజారు

ప్రభాస్ తో వర్షం సినిమా తో పాటు ఇంకా పలు సినిమా లను రూపొందించిన దర్శకుడు శోభన్‌.

ఈ దివంగత దర్శకుడి ఇద్దరు కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.చాలా మందికి వీరిద్దరు శోభన్ తనయులు అనే విషయం తెలియదు.

అసలు ఈ జనరేషన్ ప్రేక్షకులు శోభన్‌ గురించి తెలిసే అవకాశం లేదు.అంటే బ్యాక్ గ్రౌండ్‌ లేకుండానే ఆయన తనయులు సంతోష్‌ శోభన్( Santhosh Shobhan ) మరియు సంగీత్ శోభన్‌( Sangeeth Shoban ) లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.

మొదట సంతోష్ శోభన్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ఈయన హీరో గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి పదేళ్లకు పైగా పూర్తి అయింది.

ఈ పదేళ్లలో చాలా తక్కువ సినిమాలు మాత్రమే పర్వాలేదు అన్నట్లుగా నిలిచాయి. """/" / సంతోష్ శోభన్ ను ఇంకా కూడా జనాలకు దగ్గర చేసిన సినిమా బలంగా పడలేదు.

మరో వైపు సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్‌ శోభన్ దూసుకు పోతున్నాడు.సినిమా లు అనే కాకుండా సిరీస్ లు, షార్ట్‌ ఫిల్మ్స్ ఇలా ఏది వస్తే అదే అన్నట్లుగా దున్నేసుకుంటూ వెళ్తున్నాడు.

ఇటీవలే మ్యాడ్‌ సినిమా లో( Mad Movie ) తనదైన కామెడీ టైమింగ్‌ తో నటించి నవ్వించి మెప్పించిన సంగీత్‌ శోభన్‌ ని చాలా మంది కూడా జూనియర్ అల్లరి నరేష్ అన్నట్లుగా చెప్పుకున్నారు.

ఇప్పుడు సంగీత్‌ శోభన్ నటించిన ప్రేమ విమానం సినిమా( Prema Vimanam Movie ) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

"""/" / జీ5 ద్వారా ఈ సినిమా ను స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు.ఇందులో సంగీత్‌ నటన మరో లెవల్ అన్నట్లుగా ఉండబోతుంది అంటూ ట్రైలర్ ని చూస్తే అనిపిస్తుంది.

తప్పకుండా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునే విధంగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకం ను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలే మ్యాడ్‌ తో హిట్ అందుకున్న సంగీత్‌ ఈసారి ప్రేమ విమానంతో కుమ్మేస్తాడేమో చూడాలి.

హీరోగా సంగీత్‌ కి వరుస విజయాలు దక్కుతూ ఉంటే పాపం సంతోష్ శోభన్ కి మాత్రం ఆఫర్లు లేక ఢీలా పడ్డాడు.

కథల ఎంపిక విషయం లో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని నెటిజన్స్ మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య అఖండ 2 సినిమాలో విలయ తాండవం చేయబోతున్నాడా..?