సంక్రాంతికి ముందు వచ్చే భోగి విశిష్టత … ఏమిటి?

హిందూ సాంప్రదాయాల ప్రకారం తెలుగు వారు ఎన్నో పండుగలను ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు.

అయితే అన్ని పండుగలు చంద్ర మానాన్ని ఆధారంగా చేసుకొని నిర్ణయించబడతాయి.కానీ సంక్రాంతి పండుగను మాత్రం ఎంతో భిన్నంగా ఆ సూర్యుని ఆధారంగా చేసుకొని జరుపుకుంటారు.

సూర్యుడు ధనుర్మాసం నుంచి మకర రాశిలో ప్రవేశించేటప్పుడు ఈ పండుగను జరుపుకుంటారు.ఈ సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.

భోగి, మకర సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజులు సంక్రాంతి పండుగను ఎంతో వైభవంగా జరుపుకోవడం మనం చూస్తుంటాము.

అయితే సంక్రాంతికి ముందు వచ్చే రోజును భోగిగా జరుపుకుంటాము.ఈ భోగి పండుగ విశిష్టత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ఈ రోజున మకర సంక్రాంతిగా జరుపుకుంటారు.

అయితే భోగి దక్షిణయానికి, ధనుర్మాసాన్ని కి చివరి రోజుగా భోగిని జరుపుకుంటారు.భోగి అంటే భోగి భాగ్యాల అన్నింటిని కల్పించేదని అర్థం.

ఈ సంక్రాంతి పండుగను రైతుల పండుగ అని కూడా అంటారు.రైతులు పండించిన ధాన్యాన్ని ఇంటికి చేరుకోవడంతో రైతులు ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు.

భోగి రోజు తెల్లవారుఝామునే నిద్ర లేచి భోగిమంటలు వేసుకుని కొత్త జీవితానికి స్వాగతం పలుకుతూ ఎంతో ఆనందంగా, వివిధ రకాల రంగవల్లులు వేసి ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు.

"""/" / అంతేకాకుండా ఈ భోగి రోజు మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు స్నానాలు ఆచరించి కొత్త బట్టలు ధరించి వారిపై భోగి పళ్ళు వేయటం ద్వారా వారికి బాలారిష్టాలు, గ్రహ పీడలు తొలగి పోయి ఎంతో ఆరోగ్యకరమైన జీవితం పొందుతారని భావిస్తారు.

భోగి పళ్ళు అనగా రేగుపళ్ళు, చిల్లర, జీడి పండ్లు వంటి వాటిని పిల్లల తలపై వేసి వారికి హారతి ఇవ్వడం ద్వారా పిల్లలు ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారని భావిస్తారు.

మూడు రోజుల పాటు సాగే ఈ పండుగలు హరిదాసు పాటలు, గంగిరెద్దుల కోలాటం, గాలిపటాలు ఎగురవేయడం, రంగు రంగు ముగ్గులను వేసి అందులో గొబ్బెమ్మలను పెడుతూ ఎంతో ఆనందంగా తెలుగుదనం ఉట్టిపడేలా ఈ పండుగను జరుపుకుంటారు.

త్వరలోనే స్టేషన్ ఘనపూర్ లో ఉపఎన్నిక.. మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కామెంట్స్