టాలీవుడ్ కు కలిసొచ్చిన సంక్రాంతి.. మూడు సినిమాలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి లక్కీ సీజన్లలో సంక్రాంతి పండుగ(Sankranti FestivaL) కూడా ఒకటనే సంగతి తెలిసిందే.

ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుగా గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్(Game Changer, Daku Maharaj) సినిమాలు ఇప్పటికే విడుదల కాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఇప్పటికే బుకింగ్స్ మొదలయ్యాయి.

గేమ్ ఛేంజర్ మూవీకి ఆశించిన టాక్ రాకపోయినా ఈ సినిమా కలెక్షన్లు చాలా ఏరియాలలో స్టడీగా ఉన్నాయి.

గేమ్ ఛేంజర్ మూవీకి రెండో రోజు 21 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి.

మరోవైపు డాకు మహారాజ్ (Daku Maharaj)మూవీకి హిట్ టాక్ వచ్చింది.క్రిటిక్స్ నుంచి ఈ సినిమా పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకోవడం గమనార్హం.

డాకు మహారాజ్ తో మెప్పించిన బాలయ్య(Balayya) గత 4 సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయి.

డాకు మహారాజ్ సినిమా కలెక్షన్ల విషయంలో అదరగొట్టాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.డాకు మహారాజ్ లో మూడు లుక్స్ లో కనిపించి బాలయ్య తన నటనతో మెప్పించారు.

"""/" / డాకు మహారాజ్ మూవీ ఫస్ట్ డే (Daku Maharaj Movie First Day)కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి.

బాక్సాఫీస్ వద్ద బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.నెక్స్ట్ లెవెల్ కథాంశాలను ఎంచుకుంటున్న బాలయ్య అఖండ2(Balayya Akhanda 2) సినిమాతో, తర్వాత సినిమాలతో కూడా రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉందని కచ్చితంగా చెప్పవచ్చు.

"""/" / బాలయ్య మాస్ సినిమాలతో కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.బాలయ్య పారితోషికం 34 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా ఇతర భాషల్లో సైతం బాలయ్య సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బాలయ్య కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటూ ఇతర హీరోలను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు.

వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం( Venkatesh, Sankranthiki Vasthunam) సినిమాకు సైతం బుకింగ్స్ ఆహా అనేలా ఉండటం గమనార్హం.

ఇదేం పైత్యం రా బాబు.. పక్కటెముకలు తీయించుకుని అందులో పెట్టుకుంటుందట..?