2024 సంక్రాంతి సినిమాలు.. హిట్ టాక్ వస్తే గుంటూరు కారం మూవీకి ఆ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయా?

ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ( Sankranti ) కానుకగా విడుదలయ్యే సినిమాలు హిట్ టాక్ వస్తే సులువుగా 200 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించాయి.

సంక్రాంతి పండుగకు మూడు నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ కావడానికి అనుకూల పరిస్థితులు ఉంటాయి.

2024 సంక్రాంతి కానుకగా నాలుగు కంటే ఎక్కువ సినిమాలు రిలీజయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

సంక్రాంతి సినిమాలలో అన్ని సినిమాలతో పోల్చి చూస్తే గుంటూరు కారం సినిమాపై( Guntur Karam ) ఎక్కువగా అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

సంక్రాంతికి గుంటూరు కారం రేంజ్ మరో సినిమా రిలీజ్ కావడం లేదనే సంగతి తెలిసిందే.

"""/" / సంక్రాంతికి రిలీజ్ కానున్న హనుమాన్ సినిమాపై( HanuMan Movie ) కూడా బాగానే అంచనాలు నెలకొన్నాయి.

అయితే పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది.

సీనియర్ హీరోలైన రవితేజ ఈగిల్,( Eagle ) వెంకటేశ్ సైంధవ్,( Saindhav ) నాగార్జున నా సామిరంగ( Na Saami Ranga ) సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈ సినిమాల సక్సెస్ లో టాక్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. """/" / విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాపై( Family Star ) కూడా అంచనాలు పెరగగా ఈ సినిమా సంక్రాంతికి రిలీజయ్యే అవకాశం అయితే లేదని సమాచారం అందుతోంది.

గుంటూరు కారం సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని భారీ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందేమో చూడాల్సి ఉంది.

దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమాలు ఈ మధ్య కాలంలో రిలీజ్ డేట్లను మార్చుకుంటూ ఫ్యాన్స్ కు షాకిస్తున్నాయి.

దిల్ రాజు రాబోయే రోజుల్లో మరిన్ని భారీ సినిమాల నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ మూవీపై అల్లు అరవింద్ పరోక్షంగా సెటైర్లు వేశారా.. అసలేం జరిగిందంటే?