పవర్ స్టార్ - రెబల్ స్టార్ ఫైట్ లో.. తగ్గేది ఎవరు.. నెగ్గేది ఎవరు?
TeluguStop.com
మన తెలుగు ఇండస్ట్రీ లో సంక్రాంతికి ప్రతి ఏడాది బాక్సాఫీస్ ఫైట్ ఉంటూనే ఉంటుంది.
ఇక 2022 సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ ఫైట్ ఉండబోతుంది.స్టార్ హీరోలు తమ సినిమాలను విడుదల చేసేందుకు పోటీ పడుతున్నారు.
అయితే ఇప్పటికే సంక్రాంతి పోటీ నుండి మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమా తప్పుకుంది.
అసలైతే అందరి కంటే ముందు మహేష్ బాబు నే తన సినిమాను ప్రకటించాడు.
కానీ ఆ తర్వాత ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా బరిలోకి దిగడంతో మహేష్ వెనక్కి తగ్గాడు.
ఇక ఇప్పుడు మిగిలింది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలు రేస్ లో ఉన్నాయి.
ఆర్ ఆర్ ఆర్ సినిమా ఈ రెండు సినిమాల కంటే వారం ముందుగానే విడుదల అవుతుంది.
కానీ పవర్ స్టార్, రెబల్ స్టార్ సినిమాలు మాత్రం ఒక్కరోజు రోజుల గ్యాప్ తోనే విడుదల కాబోతున్నాయి.
ఆర్ ఆర్ ఆర్ సినిమా అయితే కన్ఫర్మ్ గా విడుదల అవుతుందని ప్రమోషన్స్ చూస్తేనే అర్ధం అవుతుంది.
దీంతో మిగిలిన రెండు సినిమాలు చివరి వరకు ఉంటాయా లేదా అనే సందేహం కలుగుతుంది.
మొన్నటి వరకు పవర్ స్టార్ భీమ్లా నాయక్ సినిమా రేస్ నుండి తప్పుకుంటుందని వార్తలు వచ్చాయి.
కానీ ఈ సినిమా నిర్మాణ సంస్థ అయినా సితార ఎంటర్టైన్మెంట్స్ మాత్రం ఈ సినిమా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మరొకసారి విడుదల తేదీ ప్రకటించి స్పష్టం చేసారు.
"""/"/
ఇక రాధే శ్యామ్ విషయానికి వస్తే ఈ సినిమా గత రెండు సంవత్సరాలుగా తెరకెక్కుతుంది.
కరోనా కారణంగా ఇప్పటి వరకు చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది.ఇక ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తి అయితే కనిపించడం లేదు.
మరి ఇప్పుడు వీరిద్దరి ఫైట్ ఆసక్తికరంగా మారింది.ఇంకా నెల రోజుల సమయం ఉండడంతో చివరి వరకు సంక్రాంతి రేస్ లో ఉండేది ఎవరో.
మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో నిలిచిపోయిన భారీ లారీ.. వాహనదారుల అవస్థలు