ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం చూసేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ సీన్లను కట్ చేశారా?
TeluguStop.com
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ మామ హీరోగా నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.
( Sankranthiki Vasthunnam ) సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఫుల్ పక్క ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిలిచింది.సినిమాను చూసిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వాల్సిందే.
అంతలా ప్రేక్షకులను అలరించింది ఈ చిత్రం.ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఇటీవలే టెలివిజన్ పై ప్రసారమైన విషయం తెలిసిందే.
ఇటీవల జీ తెలుగులో( Zee Telugu ) ఈ సినిమా ప్రసారమయింది.థియేటర్లలో బాగా అలరించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో( OTT ) స్ట్రీమింగ్ అవుతోంది.
ఇటు టెలివిజన్ ప్రీమియర్ గానూ ప్రసారమవుతోంది. """/" /
కానీ సినిమా నిడివి విషయంలో మాత్రం పెద్ద షాక్ ఇచ్చింది.
థియేటర్ లో 2 గంటలా 24 నిమిషాలు ప్రదర్శితమవ్వగా ఓటీటీలో ఆ సమయం తగ్గిపోయింది.
జీ5లో కేవలం 2 గంటలా 16 నిమిషాల నిడివితో సినిమాను స్ట్రీమ్ చేశారు.
దీంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.థియేటర్ వెర్షన్ లో నిడివి కారణంగా కొన్ని కామెడీ సన్నివేశాలను దర్శకుడు అనిల్ రావిపూడి( Anil Ravipudi ) తొలగించారని, అవి ఓటీటీలో యాడ్ చేస్తారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
మరి ముఖ్యంగా సినిమా ఫ్ల్లాష్ బ్యాక్ లో మీనాక్షి చౌదరి,( Meenakshi Chaudhary ) వెంకటేశ్( Venkatesh ) ల మధ్య కొన్ని కామెడీ సీన్స్ ను యాడ్ చేయనున్నారంటూ ప్రచారం కూడా జరిగింది.
"""/" /
ఎక్స్ ట్రా సీన్స్ యాడ్ చేయడం పక్కన పెడితే ఉన్న సన్నివేశాలనే కట్ చేశారని తెలుస్తోంది.
ఇప్పటివరకూ థియేటర్ లో అలరించిన పలు చిత్రాలన్నీ ఓటీటీలో అదనపు నిడివితో వచ్చాయి.
సంక్రాంతికి థియేటర్ లో వినోదాల విందును పంచిన ఈ మూవీ మాత్రం తగ్గిన నిడివితో రావడం అభిమానుల్ని షాక్‌కు గురి చేస్తోంది.
దాదాపు 8 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలకు కట్ చేసినట్లు తెలుస్తోంది.దీనిపై టీమ్ అధికారికంగా స్పందిస్తుందేమో చూడాలి మరి.
అయితే సినిమాలో ఎక్కడెక్కడ ఏవేవి కట్ చేశారు అన్నది తెలియాలి అంటే మాత్రం సినిమాను చూడాల్సిందే.
ఇప్పటికే సినిమాలో థియేటర్లో చూసిన ప్రేక్షకులకు ఏ సన్నివేశాలు కట్ చేశారు అన్న విషయం బాగా అర్థమవుతుంది.