ఆ జిల్లాలో తొలి స్థానంలో నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం.. అన్ని రికార్డ్స్ బ్రేక్ అయ్యాయిగా!
TeluguStop.com

సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం మూవీ( Sankranthiki Vasthunnam Movie ) బాక్సాఫీస్ వద్ద ఆంచనాలకు మించి విజయం సొంతం చేసుకుంది.


సంక్రాంతికి విడుదలైన ఇతర సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమాకు బెటర్ కలెక్షన్లు వచ్చాయి.


వీక్ డేస్ లో కూడా కలెక్షన్ల విషయంలో ఈ సినిమా అదరగొడుతున్న సంగతి తెలిసిందే.
అయితే విజయనగరం జిల్లాలో( Vizianagaram District ) కలెక్షన్ల విషయంలో ఈ సినిమా సంచలనాలు సృష్టించింది.
2 కోట్ల 21 లక్షల 36 వేల 978 రూపాయల కలెక్షన్లతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.
గతంలో ఏ సినిమాకు సొంతం కాని రికార్డ్ ఈ సినిమాకు సొంతం కావడం సినీ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.
ఆర్( RRR ) ప్రస్తుతం రెండో స్థానంలో ఉండగా పుష్ప2( Pushpa 2 ) మూవీ మూడో స్థానంలో ఉందని సమాచారం అందుతోంది.
కల్కి, బాహుబలి2, దేవర సినిమాలు తర్వాత స్థానాలలో ఉన్నాయి. """/" /
అల వైకుంఠపురములో, సలార్, వకీల్ సాబ్, గేమ్ ఛేంజర్ సినిమాలు తర్వాత స్థానాలలో ఉన్నాయి.
విజయనగరం టాప్ 10 వసూళ్ల జాబితాలో వెంకీ మామ మూవీ తొలి స్థానంలో నిలవడం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.
విక్టరీ వెంకటేశ్( Victory Venkatesh ) తర్వాత సినిమాలతో భారీ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
"""/" /
సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది.
వెంకటేశ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచిందని చెప్పవచ్చు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా కథ రొటీన్ అయినా కథనం కొత్తగా ఉండటం ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయిందని చెప్పవచ్చు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఇతర భాషల్లోకి డబ్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలోని బుల్లిరాజు పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ రావడం గమనార్హం.
రోజుకు 4 జీడిపప్పులను తేనెతో కలిపి తింటే లాభాలే లాభాలు!